న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి.. రాబోయే వన్డేలలో అతనే!!

Ravi Shastri Names Shreyas Iyer As His Preferred No.4 Option || Oneindia Telugu
Head coach Ravi Shastri names India’s No. 4 for upcoming ODIs

ఆంటిగ్వా: గత కొంత కాలంగా భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టీమిండియా చాలా మందినే ప్రయోగించింది. అంబటి రాయుడు, దినేష్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ , మనీష్ పాండే ఇలా చాలా మందినే పరీక్షించింది. చివరకు నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకున్నాడు. అయితే అతడు ఫామ్ కోల్పోవడంతో ప్రపంచకప్‌లో ఎంపిక చేయలేదు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్ ఆడినా విఫలమయ్యాడు. నం.4లో సరైన ఆటగాడు లేని కారణంగానే ప్రపంచకప్‌ సెమీస్ నుండి భారత్ నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రపంచకప్‌ అనంతరం ఈ నం.4పై మళ్లీ చర్చ జరిగింది.

<strong>'టీమిండియా చేతిలో ఓడితే ప్రపంచమేమీ అంతం కాదు'</strong>'టీమిండియా చేతిలో ఓడితే ప్రపంచమేమీ అంతం కాదు'

కోహ్లీతో కలిసి కీలక పాత్ర:

కోహ్లీతో కలిసి కీలక పాత్ర:

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్‌ బ్యాట్‌తో సత్తాచాటుకున్నాడు. రెండు వరుస హాఫ్ సెంచరీలతో రాణించి.. జట్టు విజయాలలో కోహ్లీతో కలిసి కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత హెడ్ కోచ్‌ రవిశాస్త్రి నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చాడు. రవిశాస్త్రి మాటలను చూస్తే.. నాలుగో స్థానానికి దాదాబు జవాబు దొరికిందనే చెప్పొచ్చు.

అయ్యర్‌ నాలుగో స్థానంలోనే:

అయ్యర్‌ నాలుగో స్థానంలోనే:

తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ... 'గత రెండు సంవత్సరాలుగా మేము నాలుగో స్థానంపై దృష్టి కేంద్రీకరించాం. చాలా మంది యువకులను కూడా పరీక్షించాం. ఇప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో మంచి ఆటగాడు దొరికిండనే అనుకుంటున్నా. భారత్‌ ఆడబోయే తదుపరి వన్డే సిరీస్‌ల్లో అయ్యర్‌కు అవకాశాలు ఇస్తాం. ఇక నుంచి వన్డేల్లో అయ్యర్‌ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తాడు' అని రవిశాస్త్రి స్పష్టం చేసారు.

న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం.. లంక ఖాతాలో అరుదైన ఘనత

లాంటి అద్భుతాలైనా చేయొచ్చు:

లాంటి అద్భుతాలైనా చేయొచ్చు:

'భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని బెంచ్ బలం బాగా ఉండేలా చూసుకుంటాం. యువకులు స్థిరమైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. రిషబ్, బుమ్రా, కుల్దీప్, హార్దిక్, మయాంక్, శంకర్ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. యువ ఆటగాళ్లతో ఎలాంటి అద్భుతాలైనా చేయొచ్చు' అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్‌ విశేషంగా రాణించాడు. దీంతో అయ్యర్‌ను నాల్గో స్థానంలో ఆడించాలనే యోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రి మొగ్గుచూపడంతో ఇక అయ్యర్‌ నాల్గో స్థానంలో నిరూపించుకోవాలి.

Story first published: Sunday, August 18, 2019, 18:46 [IST]
Other articles published on Aug 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X