న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం.. లంక ఖాతాలో అరుదైన ఘనత

గాలే: రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యంను లంక నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (122; 243 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి టెస్టులో లంక విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తడబడ్డా నిలిచారు:
ఆఖరి రోజు ఆటలో 133/0 ఓవర్ నైట్ స్కోరుతో ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నేలు లంక ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. నాలుగో రోజు కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జోడి.. చివరి రోజు కాస్త తడబడ్డారు. 161 పరుగులు జోడించిన తర్వాత తిరిమన్నే (64) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సోమర్‌విల్లే ఈ జంటను విడదీసాడు. అనంతరం 13 పరుగుల వ్యవధిలో కుశాల్ మెండిస్ (10) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ ఆచితూచి ఆడాడు.

కరుణరత్నే సెంచరీ:
మరోవైపు కరుణరత్నే కూడా సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే కరుణరత్నే బౌండరీతో సెంచరీ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం అతడికి ఇదే మొదటిసారి. మాథ్యూస్‌తో కలిసి 44 పరుగులు జత చేసిన తర్వాత కరుణరత్నే మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. విజయానికి 50 పరుగులు అవసరమున్న సమయంలో కరుణరత్నే పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన కుసాల్ పెరీరా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు.

మాథ్యూస్ మాయ:
ఈ సమయంలో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. పెరీరాను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. కానీ.. పెరీరా రివ్యూ కోరడంతో బతికిపోయాడు. ఐతే చివర్లో బౌల్ట్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అప్పటికి జట్టు స్కోరు 250 పరుగులు. విజయానికి 18 పరుగులు అవసరమవగా.. మాథ్యూస్ (28 నాటౌట్), ధనంజయ డిసిల్వా(14 నాటౌట్)తో కలసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దిముత్ కరుణరత్నేకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
బీసీసీఐ వీడియో.. కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు!!

మూడు సార్లు శ్రీలంకనే:
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల్ని మరోసారి సాధించి శ్రీలంక అరుదైన ఘనతను నమోదు చేసింది. 2016 నుంచి నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల్ని ఛేదించిన టాప్-4 జాబితాలో మూడు సార్లు శ్రీలంకనే ఉండడం విశేషం. 2017లో జింబాబ్వేపై 388 పరుగుల లక్ష్యంను శ్రీలంక సాధించగా.. అదే ఏడాది ఇంగ్లండ్‌పై 322 పరుగుల లక్ష్యంను విండీస్ ఛేదించింది. ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగుల లక్ష్యంను లంక ఛేదించగా.. ఇప్పుడు కివీస్‌పై 268 పరుగుల లక్ష్యంను ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications