న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ బంతి ఆడకపోయేసరికి.. కోహ్లీ ఓ సాధారణ బ్యాట్స్‌మన్‌ అనుకున్నా: పాక్ పేసర్

He’s just a normal batsman: How Junaid Khan dismissed Virat Kohli thrice in a series

ఇస్లామాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ఏ మైదానంలోనైనా అవలీలగా పరుగులు చేయగల సమర్థుడు. అలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ వికెట్ తీయాలని ప్రతిఒక్క బౌలర్ కల కంటాడు. అయితే కోహ్లీపై పైచేయి సాధించిన ఒక బౌలర్ ఉన్నాడు. అతడే పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జునైద్ ఖాన్. 2012లో భారత పర్యటనకు వచ్చిన పాక్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని జునైద్ ఖాన్ మూడు సార్లు పెవిలియన్ పంపాడు.

కోహ్లీ ఉత్తమ ఆటగాడు:

కోహ్లీ ఉత్తమ ఆటగాడు:

జునైద్‌ ఖాన్‌ తాజాగా 'క్రిక్‌ఇన్‌జిఫ్‌' అనే యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ తన ఆటకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో 2012 భారత పర్యటనలో విరాట్ కోహ్లీ ఆట గురించి మాట్లాడుతూ... 'ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవర్ని అడిగినా.. విరాట్ కోహ్లీ, జో రూట్‌, కేన్ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ అజామ్‌ లాంటి ఆటగాళ్లు ఈ తరంలో మంచి బ్యాట్స్‌మెన్‌ అంటారు. వారందరిలో కూడా కోహ్లీ ఉత్తమ ఆటగాడు' అని పాక్ పేసర్ అన్నాడు.

విరాట్ సాధారణ బ్యాట్స్‌మన్‌ అకున్నా:

విరాట్ సాధారణ బ్యాట్స్‌మన్‌ అకున్నా:

'2012 భారత పర్యటన కన్నా ముందే నేను దేశవాళీ క్రికెట్‌ ఆడా. అప్పుడు బాగా సాధన‌ చేయడంతో భారత పర్యటనలో రాణించా. ఆ పర్యటన ద్వారానే నేను వన్డేలకు తిరిగొచ్ఛా. అప్పుడు మంచి ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం, భారత్‌లో వికెట్లు పడగొడితే ఆ తర్వాత కూడా అలాగే కొనసాగాలనే విషయం నాకు తెలుసు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీకి తొలి బంతి వేసినప్పుడు అది వైడ్‌ బంతిగా పడింది. తర్వాతి బంతిని కోహ్లీ ఆడకపోయేసరికి అతడు సాధారణ బ్యాట్స్‌మన్‌ అకున్నా. కానీ అనంతరం ఎలా రెచ్చిపోయాడో మనందరికీ తెలుసు' అని జునైద్‌ వ్యాఖ్యానించాడు.

కోహ్లీకి దీటుగా బదులిచ్చా:

కోహ్లీకి దీటుగా బదులిచ్చా:

2012 సిరీస్‌ కన్నా ముందు విరాట్ కోహ్లీ తనతో సరదాగా మాట్లాడినట్లు పాక్‌ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ వెల్లడించాడు. 'ఇవి భారత పిచ్‌లు, ఇక్కడ నీ ప్రభావం ఉండదు' అని చెప్పడంతో తాను కూడా దీటుగా బదులిచ్చానని చెప్పాడు. 'చూద్దాం.. నేను కూడా మంచి ఫామ్‌లో ఉన్నా' అని కోహ్లీతో చెప్పినట్లు జునైద్‌ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో జునైద్‌ ఖాన్‌ ఇప్పటివరకు 22 టెస్టుల్లో, 76 వన్డేల్లో, 9 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 188 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ ఫస్ట్ వీక్‌కు ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు దూరం!

Story first published: Monday, July 27, 2020, 13:26 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X