న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిది.. లేకుంటే వాయించేస్తాడు: కివీస్ పేసర్

Hes an exceptional batsman, New Zealand pacer Lockie Ferguson lauds Rohit Sharma

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్, లిమిటెడ్ ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్‌కు తాను వీరాభిమానినని తెలిపిన ఈ కివీస్ పేసర్.. తానేదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ కూడా హిట్‌మ్యానేనని తెలిపాడు. రోహిత్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే ప్రత్యర్థికి అంత మంచిదని లేకుంటే విధ్వంసకర ఆటతో వాయించేస్తాడన్నాడు. తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెర్గూసన్‌ను ఏ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడం కష్టంగా ఫీలవుతావని ప్రశ్నించగా రోహిత్ పేరు చెప్పాడు.

రోహిత్‌కు బౌలింగా..?

రోహిత్‌కు బౌలింగా..?

‘మంచి ప్రశ్న. చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం సవాల్‌గా ఉంటుంది. అతన్ని త్వరగా ఔట్ చేయకపోతే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు. అతనో వరల్డ్ క్లాస్ బ్యాటర్'అని ఫెర్గూసన్ కొనియాడాడు.

అప్పుడు భలే ఉంటుంది..

అప్పుడు భలే ఉంటుంది..

ఇక రోహిత్ పాటు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు కూడా బౌలింగ్ చేయడం కష్టమేనని ఈ రైట్ ఆర్మ్ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అయిన కోహ్లీ, స్మిత్, వార్నర్‌లకు బౌలింగ్ చేయడం కఠినంగానే ఉంటుంది. కానీ టాపార్డర్‌లోనే వీరిపనిపట్టి.. మిడిలార్డర్, లోయరార్డర్‌లో బౌలింగ్ చేయడం మాత్రం అద్భుతంగా ఉంటుంది'అని ఫెర్గూసన్ తెలిపాడు. అసాధారణమైన ఆటగాడైన రోహిత్ అంటే తనకు పిచ్చని, అతని వీరాభిమానినని ఈ కివీస్ పేసర్ చెప్పుకొచ్చాడు.

 ట్రిపుల్.. డబుల్ మొనగాడు..

ట్రిపుల్.. డబుల్ మొనగాడు..

ఇక రోహిత్ శర్మ మైదానంలో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు. కుదరుకున్నాడంటే మాత్రం బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడు. అతని వన్డే కెరీర్‌లో సాధించిన మూడు డబుల్ సెంచరీలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక వన్డేల్లో అత్యధిక స్కోర్(264)తో పాటు మూడు ట్రిపుల్ డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. అలాగే టీ20ల్లో నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో చివరిసారిగా ఆడిన రోహిత్.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం సమాయత్తం అవుతున్నాడు.

ఫ్యూచర్ ధోనీ హిట్‌మ్యానే..

ఫ్యూచర్ ధోనీ హిట్‌మ్యానే..

ఇక రోహిత్ శర్మను టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సైతం ప్రశంసించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత జట్టులో భవిష్యత్తు ధోనీ ఈ ముంబైకరేనని జోస్యం చెప్పాడు. ‘భారత క్రికెట్ జట్టులో మరో ధోనీ రోహిత్ శర్మనే. మైదానంలోని ప్రశాంతంత, ఓపికగా వినే పద్దతి, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే పద్దతి నేను గమనించా. అచ్చం ధోనీలానే అతని సారథ్యం ఉంది. అందుకే రోహిత్ మరో ధోనీ అంటున్నా'అని రైనా కొనియాడాడు.

ఐపీఎల్ 2020: నో ఫ్యాన్స్.. ఆటగాళ్లకు రెండు వారాల్లో నాలుగుసార్లు పరీక్షలు!

Story first published: Thursday, July 30, 2020, 13:40 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X