న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టెయిన్ మాదిరి బౌలింగ్: వరల్డ్ క్లాస్ బౌలర్ అంటూ ఆర్చర్‌కు వార్నర్ ప్రశంస

David Warner Hails Jofra Archer’s 'World-Class' Bowling || Oneindia Telugu
He bowled at bit like Dale Steyn: David Warner hails world-class Jofra Archer

హైదరాబాద్: ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా అర్చర్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ ఐదు వికెట్లు తీసిన నేపథ్యంలో వార్నర్ వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్‌ అంటూ కొనియాడాడు.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్‌ తరుపున అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన జోఫ్రా ఆర్చర్ తన తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌‌ను తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

<strong>సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!</strong>సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

వార్నర్‌ మాట్లాడుతూ

వార్నర్‌ మాట్లాడుతూ

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆనంతరం డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ "కొత్త బంతితో ఆర్చర్‌ బౌలింగ్‌ విధానం చూస్తుంటే నాకు డేల్‌ స్టెయిన్‌ గుర్తుకు వస్తున్నాడు. వేగంతో పాటు పేస్‌లో వైవిద్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పిచ్‌, మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆర్చర్‌ ఇప్పుడే ప్రపంచ శ్రేణి బౌలర్‌ను తలపిస్తున్నాడు" అని అన్నాడు.

నిప్పులు చెరిగిన ఆర్చర్

నిప్పులు చెరిగిన ఆర్చర్

జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో విజృంభించడంతో యాషెస్‌ మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి పర్యాటక ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. తొలి రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లాండ్‌ స్పష్టమైన పైచేయి సాధించింది.

కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన

కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన

ఆర్చర్‌, బ్రాడ్‌ విజృంభించడంతో మిడిలార్డర్‌లో ట్రెవిస్‌ హెడ్‌ (0), మాథ్యూవేడ్‌ (0) డకౌటయ్యారు. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (11) కూడా నిరాశపరిచాడు. ప్యాటిన్సన్‌ (2), కమిన్స్‌ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్‌ బౌలర్ల దాటికి ఆసీస్ 43 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. ఆర్చర్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

తొలి టెస్టు: విండీస్ పేసర్ల విజృంభణ.. ఆదుకున్న రహానే

1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

వర్షం కారణంగా బుధవారం పూర్తిస్థాయి ఆట సాగలేదు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 23, 2019, 12:20 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X