న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022 ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో ఆ స్పెషలిస్ట్ బౌలర్ దూరం!

Harshal Patel Set To Miss Asia Cup 2022
గాయం కారణంగా టీమిండియాకు దూరం కానున్న స్లో బౌలింగ్ స్పెషలిస్ట్ *Cricket | Telugu OneIndia

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022 టోర్నీ ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్, స్లో బౌలింగ్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో 32 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన హర్షల్ పటేల్.. టీ20 స్పెషలిస్ట్‌గా భారత జట్టులోకి వచ్చాడు. తనదైన స్లో బౌలింగ్‌తో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌‌గా విమర్శకుల మన్ననలు అందుకున్న అతను అనతి కాలంలోనే టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదిగాడు.

మూడు నెలల రెస్ట్..

మూడు నెలల రెస్ట్..

టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న అతను ఇప్పుడు గాయం కారణంగా దూరం కానున్నాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్.. మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. ఈ కథనం ప్రకారం హర్షల్ పటేల్ ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు (అక్టోబర్‌లో ప్రారంభం) కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే హర్షల్ పటేల్ దూరమవ్వడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది.

షమీని కాదని..

షమీని కాదని..

ఐపీఎల్ 2021లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, ఆ సీజన్ తర్వాత 31 ఏళ్ల వయసులో భారత జట్టు తరుపు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరుపున 17 మ్యాచులు ఆడి 23 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు. దాంతోనే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెడుతూ, హర్షల్ పటేల్‌ని మూడో పేసర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది . కీలక సమయాల్లో బ్యాటుతోనూ రాణించగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు.

టీమిండియాకు గాయాల బెడద..

టీమిండియాకు గాయాల బెడద..

హర్షల్ పటేల్ గాయపడడంతో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కనుంది. ఒకవేళ దీపక్ చాహార్ ఆసియా కప్ టోర్నీలో రీఎంట్రీ ఇస్తే... టీమిండియా మూడో పేస్ బౌలర్ సమస్య తీరినట్టే. ఇప్పటికే కేఎల్ రాహుల్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో కొన్ని నెలలుగా భారత జట్టుకి దూరంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తరుచూ గాయపడుతూ జట్టుకి దూరమవుతున్నాడు... ఇప్పుడు ఈ లిస్టులో హర్షల్ పటేల్ కూడా చేరిపోయాడు...

Story first published: Saturday, August 6, 2022, 22:13 [IST]
Other articles published on Aug 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X