న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ గెలిచే సీన్ రోహిత్ సేనకు లేదు.. ఎందుకంటే: హర్షా భోగ్లే

 Harsha Bhogle says I dont think India is favourites in this T20 World Cup 2022

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022‌ టైటిల్‌ను గెలిచే సీన్ టీమిండియాకు లేదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని తాను అస్సలు అనుకోవడం లేదని చెప్పాడు. తాజాగా ది గ్రేడ్ క్రికెటర్ అనే యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షాభోగ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ బలహీనంగా ఉందని, తన అంచనా ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ చేరుతాయని తెలిపాడు. ఈ రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయని చెప్పాడు. ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు.

బౌలింగ్ బలహీనం...

బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారని గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే తాను టీమిండియా ఈ ప్రపంచకప్‌లో ఫేవరేట్ కాదని చెబుతున్నానని తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీ.. ఈ టోర్నీలో దుమ్మురేపుతాడని, అతను ఫామ్‌లోకి రావడానికి సరైన వేదిక ఆస్ట్రేలియానేనని తెలిపాడు.

ప్రస్తుతం హర్షా భోగ్లేకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. హర్షా భోగ్లే వ్యాఖ్యలపై భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హర్షా భోగ్లే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు.

 కపిల్ దేవ్ సైతం..

కపిల్ దేవ్ సైతం..

ఇక భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం భారత్‌కు ప్రపంచకప్ గెలిచే సీన్ లేదన్నాడు. రోహిత్ సేనకు సెమీస్ చేరే అవకాశాలు 30 శాతమే ఉన్నాయని చెప్పాడు. 'టీ20 ఫార్మాట్‌‌లో భారత్‌ ఒక విజయం సాధిస్తే.. మరొక మ్యాచ్‌లో ఓటమిపాలవుతోంది. ఇలాంటి స్థితిలో జట్టుపై నమ్మకం ఉంచుకోవడం చాలా కష్టం. పొట్టి కప్‌ అవకాశాలపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ ప్రధానాంశం టాప్‌-4లో నిలిచి సెమీస్‌కు చేరుకుంటుందా..? లేదా..? అదే నాకు కూడా ఆందోళనగా ఉంది. ఎవరేమి చెప్పినా నా అభిప్రాయం ప్రకారం భారత్ సెమీస్‌కు వెళ్లేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉంది.

 బ్యాటింగ్ బలంగా ఉంది..

బ్యాటింగ్ బలంగా ఉంది..

అలాగే ఆల్‌రౌండర్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. టీమిండియాకు హార్దిక్‌ పాండ్య ఉపయోగపడతాడు. ఇలాంటి ప్లేయర్లు జట్టుకు అదనపు బలం. ఆరో బౌలర్ లోటును తీరుస్తారు. అలాగే మంచి బ్యాటర్‌ కూడా. హార్దిక్‌ మాదిరిగానే రవీంద్ర జడేజా సరైన ఆల్‌రౌండర్‌. మా కాలంలో చాలా మంది ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండేవాళ్లు. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ప్రపంచకప్‌లో కీలకంగా మారతాడు. రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్‌ ఉండటం వల్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది'' అని కపిల్ తెలిపాడు.

ఆదివారం బిగ్ మ్యాచ్..

ఆదివారం బిగ్ మ్యాచ్..

అక్టోబర్ 22 నుంచి ప్రపంచకప్ సూపర్-12 పోరు ప్రారంభం కానుండగా.. టీమిండియా ఆదివారం(అక్టోబర్ 23) జరిగే తొలి మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఇక గాయంతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి రాగా.. అతనే జట్టు బౌలింగ్ బాధ్యతలను మోయనున్నాడు. ఇక సెమీస్‌కు చేరే నాలుగు జట్లలో టీమిండియా తప్పకుండా ఉంటుందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్న వేళ.. కపిల్ దేవ్, హర్ష భోగ్లేలు విభిన్నంగా వ్యాఖ్యానించడం అభిమానులను అసంతృప్తికి గురి చేస్తోంది.

Story first published: Thursday, October 20, 2022, 17:59 [IST]
Other articles published on Oct 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X