న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మతం, కులం వద్దు.. మానవత్వమే ముద్దు.. విమర్శకులకు భజ్జీ విజ్ఞప్తి!!

Harbhajan Singh posts No religion, no caste, only humanity

హైదరాబాద్: కరోనా కకలావికలం చేస్తున్న వేళ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన పేరిట ఉన్న స్వచ్చంద సంస్థ ద్వారా తమ దేశంలో పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు. ఈ పనికి ముగ్ధులైన భారత దిగ్గజ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అఫ్రిదిని మెచ్చుకుంటూ అతని ఫౌండేషన్‌కు విరాళలు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సూచించారు.

అయితే ఈ పని నచ్చని కొంత మంది అభిమానులు వీరిపై ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. శత్రు దేశానికి సాయం చేయమంటారా? అని మండిపడ్డారు. మతిపోయి మాట్లాడుతున్నారా? మీ అభిమానులుగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా హర్భజన్ సింగ్ స్పందించాడు.

ద్వేషం, వైరస్‌ను విస్తరించకండి..

ట్విటర్‌ వేదికగా ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘కులం, మతం వద్దు కేవలం మానవత్వమే ముద్దు. ద్వేషం, వైరస్‌ను వ్యాపింపచేయకండి. ప్రేమను మాత్రమే పంచండి. ప్రతీ ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయి. అందరూ దయ కలిగి ఉండండి. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి' అంటూ భజ్జీ ట్వీట్‌ చేశాడు. దీనికి ఓ వీడియోను కూడా జతచేశాడు. ఈ వీడియోలో ఇంగ్లండ్‌లో ఉన్న సిక్కులు ఆహారం తయారు చేస్తున్నారు.

ఎప్పటికీ భారతీయుడినే..

ఎప్పటికీ భారతీయుడినే..

ఇప్పటికే తనపై వచ్చిన విమర్శలపై యువీ స్పందించాడు. తాను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదన్నాడు. తాను ఎవరీ మనోభావాలను కించపరచాలనుకోలేదని స్పష్టం చేశాడు. తాను ఎప్పటికీ భారతీయుడేనని, కష్టకాలంలో ఉంటే తనకు హానీ చేసిన వారికైన సహాయం చేస్తానని యువీ పేర్కొన్నాడు.

ధోనీ ఒక్కడితోనే ప్రపంచకప్ రాలేదు : గంభీర్

ధన్యవాదాలు తెలిపిన అఫ్రిది

ధన్యవాదాలు తెలిపిన అఫ్రిది

భారత క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌కు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు. కరోనా వైరస్‌పై పాక్‌లో చేస్తున్న తన పోరాటానికి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పారని కొనియాడాడు.

‘మద్దతు తెలిపిన నా బ్రదర్స్ యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌కు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెబుతోంది. యువరాజ్‌ ఫౌండేషన్‌ యూవీకెన్‌కు అభినందనలు'అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Thursday, April 2, 2020, 20:39 [IST]
Other articles published on Apr 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X