న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంత మూర్ఖత్వమా.. క్రాకర్స్ కాల్చడంపై భజ్జీ ఫైర్!!

Harbhajan Singh Fires At Stupidity After Crackers Cause Fire In Jaipur
Cricketers Serious People Stupidity

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటానికి సమైక్యతను చాటుతూ ఆదివారం 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యా కుమారి దాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఒక్కరు లైట్లను ఆపేసి..దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.

అయితే కొంతమంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధాని ఉద్దేశానికి వ్యతిరేకంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలోకి తొక్కి వీధుల్లో కాగడాలతో ర్యాలీ చేయడం, టపాసులు పేల్చడం చేశారు. ఇలాంటి వారిపై ఇప్పటికే భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా గౌతం గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ మండిపడ్డారు. ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూర్ఖుల వల్ల అసాధ్యం..

టపాసుల వల్ల జైపూర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి మంటలు ఏర్పడ్డాయని ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ షేర్ చేసిన ఈ వీడియోను భజ్జీ రీ ట్వీట్‌ చేశాడు. ‘కరోనా వైరస్‌ నిర్మూలనకు మనం ఓ మార్గాన్ని కనిపెట్టగలం. కానీ ఇలాంటి వారి మూర్ఖత్వం వల్ల అది ఎలా సాధ్యమవుతుంది'అని తీవ్ర ఆగ్రహం వక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

జైపూర్‌లో అగ్నిప్రమాదం..

జైపూర్‌లో అగ్నిప్రమాదం..

జైపూర్‌లోని వైశాలి నగర్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసుల సమాచారమేరకు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం సంభవించినప్పుడు అక్కడా ఎవరు లేరని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జైపూర్ ఛీఫ్ ఫైర్ ఆఫిసర్ జగదీష్ పుల్వారి పీటీఐకి తెలిపారు.‘ప్రమాద విషయం తెలియగానే ఇద్దరు ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరు'అని ఆయన పేర్కొన్నారు.

ఇది సందర్భమా..?

ఇది సందర్భమా..?

టపాసులు పేల్చడంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘కరోనాపై పోరులో మధ్యలోనే ఉన్నాం. ఇంకా విజయం సాధించలేదు. టపాసులు పేల్చడానికి ఇది సందర్భం కాదు. అందరూ ఇళ్లలోనే ఉండండి' అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ క్రాకర్స్ ఎక్కడ దొరికాయ్ అంటూ అశ్విన్ వ్యంగ్యస్త్రాలు సంధించగా.. పఠాన్ ఈ ప్రమాధాన్ని ముందే ఊహించాడు. టపాసులు పేల్చనంత వరకు ప్రధాని చేపట్టిన కార్యక్రమం బాగుంటుందని ట్వీట్ చేశాడు. రోహిత్ శర్మ కూడా అత్యుతహం ప్రదర్శించిన వారిపై అసహనం వ్యక్తం చేశాడు. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడానికి భారత్ ఇంకా ప్రపంచకప్ గెలవలేదని సెటైరిక్‌‌గా ట్వీట్ చేశాడు.

Story first published: Monday, April 6, 2020, 20:31 [IST]
Other articles published on Apr 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X