న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కప్ కొట్టాలంటే దూకుడు పెంచాల్సిందే'

Happy to qualify for semis, but a lot of areas to improve: Harmanpreet Kaur

హైదరాబాద్: అనుకున్నట్లుగానే బలహీనంగా కనిపించిన ఐర్లాండ్ జట్టును మట్టి కరిపించింది హర్మన్ ప్రీత్ సేన. వరుసగా ఓడిన రెండు ఓటములకు జతగా మూడో సారి వైఫల్యానికి గురైంది ఐర్లాండ్. అంతే స్థాయిలో మూడో మ్యాచ్‌తో ఐర్లాండ్‌ను ఓడించి హ్యాట్రిక్‌ విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. ఓపెనర్‌ మిథాలీరాజ్‌(51; 56బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సు) మరోసారి హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా 52పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది.

 ప్రధాన బౌలర్లు అనుకున్నట్లు రాణించలేక

ప్రధాన బౌలర్లు అనుకున్నట్లు రాణించలేక

‘వరల్డ్ కప్ సెమీస్‌కు అర్హత సాధించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రపంచ కప్ సాధించాలంటే ఇది సరిపోదు. జట్టుగా మరికొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. ముందు వాటిని అధిగమించాలి. సాధారణంగా టీ20 ఫార్మాట్‌లో ఒక్కోసారి ప్రధాన బౌలర్లు అనుకున్నట్లు రాణించలేరు. అలాంటి సమయంలో మరో బౌలర్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో నాతో పాటుగా, జెమ్మీ కూడా బౌలింగ్‌ చేశాం.' అని హర్మన్‌ వివరించింది.

హ్యాట్రిక్‌గా దూసుకెళ్లిన భారత్.. మరోసారి మిథాలీ దూకుడు

నుంచి జరిగే మ్యాచ్‌లన్నీ హోరాహోరీగానే

నుంచి జరిగే మ్యాచ్‌లన్నీ హోరాహోరీగానే

‘ఎలాంటి సందేహం లేకుండా ఇక నుంచి జరిగే మ్యాచ్‌లన్నీ హోరాహోరీగానే సాగుతాయి. కప్‌ గెలవాలంటే కచ్చితంగా దూకుడు పెంచాల్సిందే. ఐర్లాండ్‌తో అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాం. బౌలింగ్‌ విషయంలోనూ లోపాలున్నాయి. ఆ జట్టు బలహీనత వల్లే గెలిచాం. ఇక నుంచైనా అన్ని రంగాల్లో పూర్తిస్థాయి దృష్టి సారించి మరింత దూకుడు పెంచితేనే టైటిల్‌ సాధించగలం' అని హర్మన్‌ పేర్కొన్నారు.

మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానాన్ని

మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానాన్ని

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ 4 ఓవర్లు బౌలింగ్‌చేసి 10పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టింది. జెమీమా మాత్రం ఒకే ఓవర్ వేసి 6 పరుగులు ఇచ్చింది. శనివారం జరిగే తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా దూకుడుగానే ఉండాలి. గెలవాలంటే దూకుడును కొనసాగించాల్సిందే.

జట్టుగా మరింత దూకుడు పెంచాలని

జట్టుగా మరింత దూకుడు పెంచాలని

2010 తర్వాత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లడం భారత్‌కు ఇదే తొలిసారి. టోర్నీలో వరుసగా మూడో విజయం నమోదైనా.. మిగతా మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని జట్టుగా మరింత దూకుడు పెంచాలని కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ పిలుపునిచ్చారు.

Story first published: Friday, November 16, 2018, 12:51 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X