For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాట్రిక్‌గా దూసుకెళ్లిన భారత్.. మరోసారి మిథాలీ దూకుడు

ICC Women's T20 World Cup : India Beat Ireland, Match Highlights | Oneindia Telugu
Womens World T20 2018: Mithali Raj, spinners star in 52-run victory over Ireland as India seal semi-final spot

హైదరాబాద్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌‌కు మరో విజయం లభించింది. హ్యాట్రిక్‌‌తో అదరగొట్టి ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన గ్రూప్‌-బి లీగ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి ఐర్లాండ్‌ 8 వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. భారత్‌కు ఇది హ్యాట్రిక్ విక్టరీ.. అయితే ఐర్లాండ్‌కు హ్యాట్రిక్ ఓటమి.

10 ఓవర్లకు ఐర్లాండ్‌‌ను 43/2

10 ఓవర్లకు ఐర్లాండ్‌‌ను 43/2

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి 10 ఓవర్లకు రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌‌ను 43 పరుగులకే కట్టడి చేశారు. జాయ్స్‌ (33; 38 బంతుల్లో 4ఫోర్లు) కాస్త దూకుడుగా ఆడటానికి ప్రయత్నించినా.. మరోవైపు నుంచి సహకారం లేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. ధాటిగా ఆడే క్రమంలో ఐరీష్‌ అమ్మాయిలు పెవిలియన్‌కు వరుస కట్టారు. రాధ యాదవ్‌ (3/25) వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు (ఒక రనౌట్‌) పడడంతో ఐర్లాండ్‌ కుంగిపోయింది.

క్రికెటర్‌గా ఎంతో పరిణతి చెందా: కోహ్లీ

మిథాలీ.. మంధాన క్రీజులో ఉన్నా

మిథాలీ.. మంధాన క్రీజులో ఉన్నా

రాధతో పాటు దీప్తిశర్మ (2/15), పూనమ్‌ (1/14), హర్మన్‌ప్రీత్‌ (1/10) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును మిథాలీరాజ్‌ నడిపించింది. స్మృతి మంధాన (33; 29 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే వీళ్లిద్దరూ క్రీజులో ఉన్నా జట్టు స్కోరు 4 ఓవర్లకు 16 పరుగులే. ఈ స్థితిలో రిచర్డ్‌సన్‌ వేసిన ఐదో ఓవర్లో సిక్స్‌ బాదిన మిథాలీ ఆ తర్వాత ఓవర్లో 2 బౌండరీలు సాధించింది.

రోడ్రిగ్స్‌ (18)తో కలిసి మిథాలీ స్కోరు

రోడ్రిగ్స్‌ (18)తో కలిసి మిథాలీ స్కోరు

ఈ క్రమంలోనే రాక్‌ బౌలింగ్‌లో క్రీజు వదిలొచ్చి లాంగ్‌ ఆన్‌ మీదుగా మంధాన ముచ్చటైన సిక్స్‌ కొట్టింది. ఈ భాగస్వామ్యం బలపడుతున్న స్థితిలో గారెత్‌ వేసిన బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన మందాన బౌల్డ్‌ అయింది. మిథాలీ-మందాన తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. జెమిమా రోడ్రిగ్స్‌ (18)తో కలిసి మిథాలీ స్కోరు పెంచింది. 14 ఓవర్లకు భారత్‌ స్కోరు 103 పరుగులే.

భారత్ ఐర్లాండ్‌పై సునాయాసంగా

భారత్ ఐర్లాండ్‌పై సునాయాసంగా

బ్యాట్‌ ఝుళిపించాల్సిన స్థితిలో జెమిమా ఔట్‌ కాగా.. సిక్స్‌ బాది ఊపు మీద కనిపించిన హర్మన్‌ప్రీత్‌ (7) కూడా అదే బాటలో పెవిలియన్ చేరింది. వారి వరుసలోనే వేద కృష్ణమూర్తి (9) కూడా చేరింది. రీలీ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి టీ20ల్లో 17వ హాఫ్ సెంచరీ సాధించిన మిథాలీ.. ఆ తర్వాత ఓవర్లోనే వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చింది. చివర్లో దీప్తి శర్మ (11 నాటౌట్‌) నిలబడి భారత్‌ స్కోరును 140 పరుగులు దాటించింది. ఇలా భారత్ ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచేసింది.

Story first published: Friday, November 16, 2018, 11:42 [IST]
Other articles published on Nov 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+