న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ మ్యాచ్‌కు 30 నిమిషాల కామెంటరీ అనుకుంటే.. 90 నిమిషాలు అయ్యింది'

Had no idea the last 30 minutes of commentary would extend to 90 minutes: Ian Smith on 2019 World Cup final

వెల్లింగ్టన్‌: లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది 'సూపర్‌ ఓవర్‌'. న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌ నిర్వహిస్తే.. అదీ టై అయింది. దీంతో బౌండరీల లెక్క ప్రకారం టోర్నమెంట్ విజేతగా ఇంగ్లండ్‌ను ప్రకటించారు. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన బ్లాక్‌ క్యాప్స్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. అప్పుడు అంతా కివీస్‌ది దురదృష్టం అనుకున్నారంతా. అయితే ఈ రసవత్తర ఫైనల్ పోరు కామెంటేటర్‌లకు సైతం ఆసక్తిని రేపింది.

నా కామెంటరీల్లో అదొక ఫేవరెట్‌:

నా కామెంటరీల్లో అదొక ఫేవరెట్‌:

2019 వన్డే ప్రపంచకప్ మెగా ఫైనల్‌ జ్ఞాపకాల్ని న్యూజిలాండ్‌ కామెంటేటర్‌ ఇయాన్‌ స్మిత్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తాజాగా భారత‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో ఇన్‌సైడ్‌ ఔట్ కార్యక్రమంలో ఇయాన్‌ స్మిత్‌ మాట్లాడుతూ... '2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నా ఫేవరెట్‌ కామెంటరీల్లో ఒకటి. గతంలో ఎప్పుడూ చూడని ఫైనల్‌ మ్యాచ్ అది. ఇక ముందు కూడా ఈ తరహా ఫైనల్‌ జరుగుతుందని నేను అస్సలు అనుకోవడం లేదు' అని అన్నాడు. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్ అయిన స్మిత్ ఆ దేశం తరఫున 63 టెస్టులు, 98 వన్డేలు ఆడాడు.

30 నిమిషాలు అనుకుంటే:

30 నిమిషాలు అనుకుంటే:

'ఫైనల్ మ్యాచ్‌లో నేను కామెంటరీ బాక్సులో కూర్చొని ఉన్నా. ఇంకా ఏడు ఓవర్లు ఉన్నాయి. వాటికి 30 నుంచి 35 నిమిషాలు సమయం పడుతుంది. కానీ ఆ మ్యాచ్‌ 90 నిమిషాలు పాటు జరిగింది. ఆ ఏడు చివరి ఓవర్‌లతో పాటు రెండు సూపర్‌ ఓవర్‌లు జరగడంతో 30 నిమిషాల మ్యాచ్‌.. 90 నిమిషాలకు వెళ్లింది. ఆ కామెంటరీ కాంపిటేషన్‌లా సాగలేదు, ఒక కాంబినేషన్‌లా సాగింది. మేమంతా ఒక మంచి కామెంటరీని ప్రజలకు ఇవ్వడానికి సాధ్యమైనంతవరకూ కృషి చేశాం' అని ఇయాన్‌ స్మిత్‌ తెలిపాడు.

బౌండరీ కౌంట్ ఆధారంగా:

బౌండరీ కౌంట్ ఆధారంగా:

లార్డ్స్ వేదికగా 2019 జులై 14న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌'కు మద్దతుగా.. వెస్టిండీస్ జట్టు వినూత్న నిర్ణయం!!

Story first published: Monday, June 29, 2020, 15:13 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X