For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌'కు మద్దతుగా.. వెస్టిండీస్ జట్టు వినూత్న నిర్ణయం!!

West Indies players to wear Black Lives Matter logo during Test series against England

మాంచెస్టర్‌: ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ అనంతరం జూలై 8 నుంచి వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో జాతివివక్షకు వ్యతిరేకంగా ఇరు జట్లు నిరసన చేపట్టనున్నాయి. అయితే జాతివివక్షను నిర్మూలించేందుకు వెస్టిండీస్ ఆటగాళ్లు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. జెర్సీలపై 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అనే లోగోతో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా అంగీకరించినట్లు సమాచారం.

గత నెలలో అమెరికాలో ఓ పోలీస్‌ అధికారి కర్కశత్వానికి జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ హత్యతో ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షపై ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో క్రికెట్‌లోనూ జాతి వివక్ష ఉందని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సమీ పేర్కొన్నాడు. ఆపై చాలా మంది తమ గళం వినిపించారు. ఈ నేపథ్యంలో 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. క్రీడల్లోనూ జాతివివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, దానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ ఆదివారం పేర్కొన్నాడు.

'క్రీడా చరిత్రలో, క్రికెట్‌లో, వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టులో ఇదో కీలక ఘట్టం. విజ్డెన్‌ ట్రోఫీ గెలవడానికి మేం ఇంగ్లండ్‌కు వచ్చాం. అయితే ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయంపై మాకు అవగాహన ఉంది. అందరికీ సమానత్వం, సమన్యాయం అనే విషయాలపై పోరాటం జరుగుతోంది. వెస్టిండీస్‌ క్రికెటర్లుగా మా జట్టు చరిత్ర, గొప్పతనం మాకు తెలుసు. అలాగే భావి తరాలకు మేం మార్గ నిర్దేశకులమనీ తెలుసు. ఈ నిర్ణయాన్ని మేం తేలిగ్గా తీసుకోలేదు. వర్ణ వివక్షపై మాట్లాడేవారికి ఇదెలా ఉంటుందో మాకు తెలుసు. అది చాలా దూరం వెళుతుంది. అందరిలో ఐక్యత, సమన్యాయం ఉండాలి. మనుషులుగా అది దక్కేంత వరకు మేం ఈ నిరసనను తెలియజేయడం మానుకోం. అందరికీ సమాన హక్కులు తీసుకురాడానికి ఒక మార్గాన్ని వెతకాలి' అని హోల్డర్‌ అన్నట్లు ఈఎస్‌పీఎన్‌ పేర్కొంది.

జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐసీసీకి జేసన్‌ హోల్డర్‌ విజ్ఞప్తి చేశాడు. డోపింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఆటగాళ్లకు చేసిన తప్పు తీవ్రతను బట్టి జీవితకాల నిషేధం, ఏడాది, సిరీస్‌, మ్యాచ్‌ బ్యాన్‌ విధించడం చేస్తారో.. వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన వారిని కూడా అలాగే శిక్షించాలని హోల్డర్‌ కోరాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల ముందు ఇరుజట్ల ఆటగాళ్లకు జాత్యంహకార వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో.. జాతు మేనేజ్‌మెంట్లు అవగాహన కల్పించాలని హోల్డర్‌ సూచించాడు.

Story first published: Monday, June 29, 2020, 14:37 [IST]
Other articles published on Jun 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+