న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడి బౌలింగ్‌లో పేస్‌తో పాటు కచ్చితత్వం ఉంది: ఆర్చర్‌కు మెక్‌గ్రాత్ ప్రశంస

Glenn McGrath hails Jofra Archer after England pacers thumping display in 2nd Ashes Test

హైదరాబాద్: ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. యాషెస్ సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే.

రహానే vs రోహిత్.. కోహ్లీ ఓటు ఎవరికి?

తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే స్టీవ్ స్మిత్‌ను గాయపరిచిన జోఫ్రా ఆర్చర్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎటాక్‌కు ఓ పదునైన ఆయుధంగా మారాడు. తొలిరోజు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ... ఆ తర్వాత ఉత్కంఠగా మారి... చివరకు లార్డ్స్ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

జేమ్స్ ఆండర్సన్ గాయంతో రెండో టెస్టుకు దూరమైన నేపథ్యంలో చోటు దక్కించుకున్న ఆర్చర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా లైన్ అండ్ లెంత్ బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు అభిమానుల్లో యాషెస్ ట్రోఫీని గెలుస్తామని ఆశలను చిగురింపజేశాడు.

పేస్‌తో పాటు కచ్చితత్వం

పేస్‌తో పాటు కచ్చితత్వం

తాజాగా ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం మెక్‌గ్రాత్ ఓ ఇంటర్యూలో "టెస్టుల్లో పదునైన పేస్‌తో పాటు కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఆర్చర్‌ ఆ పనిని చాలా సులువుగా చేస్తున్నాడు. అతడి బౌలింగ్‌ చాలా సహజసిద్దంగా ఉంటుంది. ​ఆర్చర్‌ రనప్‌, క్రీజును వదిలే క్రమం అన్నీ ఎక్కువ స్ట్రెస్‌ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాయి" అని అన్నాడు.

లాంగ్‌ స్పెల్‌ బౌలింగ్‌

లాంగ్‌ స్పెల్‌ బౌలింగ్‌

"అద్భుతమైన పేస్‌తో లాంగ్‌ స్పెల్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. అదే విధంగా బౌలింగ్‌ వేగంలో చాలా వేరియేషన్స్‌ చూపిస్తున్నాడు. ఆర్చర్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుభవం తోడైతే ఎన్నో రికార్డులు సృష్టిస్తాడు" అని మెక్‌గ్రాత్ తెలిపాడు. కాగా, జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ పదునైన బౌన్సర్‌కు ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాయపడిన సంగతి తెలిసిందే.

148.7 కిలోమీటర్ల వేగంతో

148.7 కిలోమీటర్ల వేగంతో

లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ 148.7 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని స్టీవ్ స్మిత్ మెడకు బలంగా తాకడంతో స్మిత్ మైదానంలో కుప్పకూలాడు. ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

మూడో టెస్టుకు దూరమైన స్టీవ్ స్మిత్

మూడో టెస్టుకు దూరమైన స్టీవ్ స్మిత్

ఆ తర్వాత నొప్పి కారణంగా రెండో టెస్టు నుంచి స్టీవ్ స్మిత్ తప్పుకున్నాడు. అయితే స్మిత్‌ గాయంతో విలవిల్లాడుతుంటే ఆర్చర్‌ ప్రవర్తించిన తీరుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌, పలువురు ఆసీస్‌ మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడ్డారు. హెడెంగ్లే వేదికగా గురువారం నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టుకు సైతం స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు.

Story first published: Wednesday, August 21, 2019, 11:57 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X