రహానే vs రోహిత్.. కోహ్లీ ఓటు ఎవరికి?

అంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్ ఎ జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో అదరగొట్టింది. ఇక గురువారం నుండి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రాంభానికి ముందు టీమిండియాకు ఓ తలనొప్పి మొదలైంది. తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతోంది.

నలుగురు బౌలర్లైతేనే:
తొలి టెస్టులో వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం కల్పించాలా? లేక టెస్టు వైస్ కెప్టెన్ అంజిక్య రహానేను ఆడించాలో? లేదా ఐదో బౌలర్ వైపు మొగ్గు చూపాలో? అని సతమతమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలనుకుంటే.. రహానే, రోహిత్లో ఒక్కరికే అవకాశం దక్కుతుంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇద్దరు ఉంటే.. స్పిన్నర్ రవీంద్ర జడేజాపై వేటు పడుతుంది.

కోహ్లీ ఓటు ఎవరికి:
ఏదేమైనా తుది జట్టులో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రహానేకు అవకాశం లభించకపోవచ్చని సమాచారం. రహానే ఏడాదికిపైగా పరుగులు చేయడం లేదు. కౌంటీ క్రికెట్‌లోనూ రాణించలేదు. ఇక విండీస్ 'ఎ'తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించాడు. మరోవైపు రోహిత్ కూడా అర్ధ శతకం బాదడం, అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టు కూర్పుపై అనుమానాలు నెలకొన్నాయి.
ఒలింపిక్స్ హాకీ టెస్టు ఈవెంట్.. ఫైనల్లో భారత మహిళా, పురుషుల జట్లు

అశ్విన్‌కే అవకాశం:
నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ చోటు దక్కించుకుంటారు. రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్‌లో ఒక్కరు మాత్రమే స్పిన్నర్‌గా బరిలోకి దిగుతారు. దాదాపు అశ్విన్‌నే ఆడించొచ్చు. అదనపు బ్యాట్స్‌మన్ కావాలంటే జడేజాను పక్కన పెట్టాల్సి ఉంటుంది. కరీబియన్ దీవుల్లో ఎండ, వేడిమి, ఉక్కపోత కారణంగా బౌలర్లు త్వరగా అలిసిపోతారు. ఓవర్‌రేట్ పడిపోకుండా ఉండాలంటే జడేజా అవసరం. కోహ్లీ ఎప్పుడూ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగేందుకే ఇష్టపడతాడు. ఈ మ్యాచ్ నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్థానం ప్రారంభం కానుండటంతో కోహ్లీ ఎలాంటి కూర్పుతో బరిలో దిగుతుందనేది ఆసక్తిగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications