న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ ఒక్క మార్పు చేస్తే.. టీ20 మ్యాచ్‌లు అదిరిపోతాయి'

Four bowlers five overs in T20: Shane Warne suggests unique change in 20-20 Format

సిడ్నీ: టీ20 ఫార్మాట్‌లో పూర్తిగా బ్యాట్స్‌మన్‌దే ఆధిపత్యం. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒకోసారి బ్యాట్స్‌మన్ ఓవర్లోని ఆరు బంతులను సిక్సులుగా కొట్టగలడు. లేదా ఒకే ఓవర్లో 20 పరుగులకు పైగా కూడా బాదగలడు. ఇక్కడ బలిపశువు బౌలర్ మాత్రమే. టీ20లో అరుదుగా మాత్రమే బౌలర్ రాణించిన సందర్భాలు ఉంటాయి. అయితే బంతి, బ్యాట్ మధ్య సమతూకం రావాలంటే.. ఒక్క మార్పు కచ్చితంగా చేయాలని ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్ అంటున్నాడు‌. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్‌ గరిష్టంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధనను మార్చాలని అంటున్నాడు‌.

ఒక్కో బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే

ఒక్కో బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే

టీ20 ఫార్మాట్‌లో ఒక్కో బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ల మధ్య పోరు సమానంగా ఉంటుంది అని షేన్‌ వార్న్ సూచించాడు. 'టీ20 ఫార్మాట్‌లో బౌలర్లను కుదించండి. ఐదు బౌలర్లతో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసే బదులు నలుగురు బౌలర్లతో ఐదేసి ఓవర్లు వేయించండి. ఈ మార్పు చేసి చూడండి.. బంతి, బ్యాట్ మధ్య సమతూకం ఉంటుంది. పోరు మజాగా మారుతుంది. ఒక బౌలర్‌ ఐదు ఓవర్లు వేయడాన్ని టీ20ల్లో చూడాలనుకుంటున్నా' అని వార్న్ కోరాడు. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి కామెంటరీ చెప్పే క్రమంలో స్కై స్పోర్ట్స్‌ క్రికెట్‌తో మాట్లాడిన వార్న్‌ పైవిధంగా పేర్కొన్నాడు.

పోరు ఆసక్తికరం

పోరు ఆసక్తికరం

'జట్టులో ఎనిమిది మంది బౌలింగ్‌ చేసే వారు ఉండవచ్చు. కానీ బౌలర్‌ ఓవర్ల కోటాను పెంచడంతో బ్యాట్స్‌మెన్‌-బౌలర్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. మధ్య ఓవర్లలో ఆదిల్‌ రషీద్‌ వంటి స్పిన్నర్‌ ఐదు ఓవర్లు వేయగలడు. ఇలా ఒక స్పిన్నర్‌ ఐదు ఓవర్లు వేయడం వల్ల అది స్పిన్‌కు బ్యాట్స్‌మెన్‌కు మంచి పోరులా ఉంటుంది. అదే సమయంలో మీరు మ్యాచ్‌ ప్రారంభంతో పాటు చివరిలో మీ త్వరతగతిన బౌలింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇక జట్టును ఎన్నుకునేటప్పుడు ఉత్తమ బ్యాట్స్‌మన్‌, ఉత్తమ బౌలర్లను ఎంచుకోవడానికి మార్గం సులభతరం అవుతుంది' అని షేన్‌ వార్న్ చెప్పుకొచ్చాడు.

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేటి బ్యాట్స్‌మన్‌లను సైతం సునాయాసంగా బోల్తా కొట్టించి.. 'స్పిన్‌ మాంత్రికుడు' అని పేరు తెచ్చుకున్నాడు. ఈ మాయాజాలంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ ‌(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 1995లో సిమోన్ క్యాలహాన్‌నుపెళ్లి చేసుకున్న వార్న్.. 2005 వరకు ఆమెతో కాపురం చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. బ్రూక్ (22), జాక్సన్ (20), సమ్మర్(18). అనంతరం అమ్మాయిలపై ఉన్న వ్యామోహంతో ఆమెతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు.

క‌రోనా వైర‌స్ సోకుతుంద‌ని తెలుసు.. నేను దానితో పోరాడ‌గ‌ల‌ను: శిఖ‌ర్ ధావ‌న్

Story first published: Monday, September 7, 2020, 18:53 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X