కరోనా వైరస్ సోకుతుందని తెలుసు.. నేను దానితో పోరాడగలను: శిఖర్ ధావన్

దుబాయ్: ఒకవేళ తనకు కరోనా వైరస్ సోకినా.. దానిని జయించే శక్తి తన శరీరానికి ఉందని టీమిండియా సీనియర్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అన్నాడు. బీసీసీఐ, సంబంధిత ఫ్రాంచైజీలు నిర్ధేశించిన మార్గదర్శకాలను ఆటగాళ్లందరూ కచ్చితంగా పాటిస్తున్నారని ధావన్ తెలిపాడు. ఐపీఎల్ 2020 కోసం గత నెలలో యూఏఈ వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్.. క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తోంది.

నేను కరోనాతో పోరాడగలను
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్ ఆడటానికి యూఏఈ వచ్చిన శిఖర్ ధావన్‌కు భయం వేయలేదా? అన్న ప్రశ్నకు అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. 'నా శరీరంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఆడటం పట్ల ఎప్పుడూ భయపడలేదు. కరోనా వైరస్ సోకుతుందని నాకు తెలుసు. కానీ నేను దానితో పోరాడగలను. నాకు నమ్మకం ఉంది' అని ధావన్ అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో గబ్బర్ ఇప్పటివరకు 34 టెస్టుల్లో, 136 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మార్గదర్శకాలను పాటిస్తున్నాం:
'బీసీసీఐ, సంబంధిత ఫ్రాంచైజీలు నిర్ధేశించిన మార్గదర్శకాలను ఆటగాళ్లందరూ కచ్చితంగా పాటిస్తున్నారు. నేను కూడా 8-9 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా. అందుకే జట్టులోని అందరం సురక్షితంగా ఉన్నాం. ఇకపై కూడా అలానే ఉండాలి. మా కదలికలు పరిమితం చేయబడ్డాయి. ఈ కఠినమైన సమయంలో కూడా బీసీసీఐ ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం నిజంగా అభినందనీయం' అని ల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.

కప్ గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం
ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కప్‌ను సాధిస్తుందా? అన్న ప్రశ్నకు ధావన్ మాట్లాడుతూ... 'మేము అందరం కలిసి ప్రణాళికలు రచిస్తున్నాం. కొత్త శక్తిని సృష్టించడం చాలా ముఖ్యం. మాకు చాలా సానుకూలతలు ఉన్నాయి. ఈసారి కప్ గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం' అని చెప్పాడు. 'శ్రేయాస్ అయ్యర్ గతేడాది జట్టును బాగా నడిపించాడు. ఈసారి జట్టులోకి సీనియర్ ఆటగాడు అంజిక్య రహానే కూడా వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఇద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. వారి అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది' అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

ఎలా రెచ్చిపోతాడో చూడాలి:
ఇక చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం అది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఆపై కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. త్వరలోనే ఐపీఎల్ 2020 ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలా రెచ్చిపోతాడో చూడాలి.
'అనుకోకుండా జరిగింది.. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు మనసారా క్షమాపణలు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications