న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Michael Holding:నేను యూకేలో పెరిగి ఉంటే.. ఇంతకాలం బతికేవాడిని కాదేమో! హోల్డింగ్‌ సంచలన వ్యాఖ్యలు!!

Former pacer Michael Holding feels I dont think I would be alive if I grew up in England

లండన్: క్రికెట్ దిగ్గజ బౌలర్, మాజీ వెస్టిండీస్‌ పేసర్ మైకెల్‌ హోల్డింగ్‌ జాత్యహంకార అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక‌వేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే.. అస‌లు బ‌తికి ఉండేవాడినే కాదేమో అని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే మరణించేవాడినన్నారు. యుక్త వయసులో ఉన్నపుడు తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని, ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా మరణించేవాడినని హోల్డింగ్‌ అన్నారు. 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడారు.

ఫ్లాయిడ్‌ మరణంతో మొదలు

ఫ్లాయిడ్‌ మరణంతో మొదలు

గతేడాది అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మెడపై కాలు పెట్టి చంపేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 'నల్ల జాతీయుల ప్రాణాలూ విలువైనవే' (#BlackLivesMatter) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ గళం విప్పారు. అంతేకాదు ఆ ఉద్యమంలో చురుగ్గా కొందరు ప్లేయర్స్ పాల్గొన్నారు. అందులో మైకెల్‌ హోల్డింగ్‌ కూడా ఒకరు. జాత్యాహంకార ధోరణిపై 'వై వీ నీల్‌, హౌ వి రైజ్‌' అనే పుస్తకాన్ని మైకెల్‌ రాశారు. త్వరలోనే ఇది విడుదల కానుంది.

వేరే దేశాలకు వెళ్లిన ప్రతిసారి

వేరే దేశాలకు వెళ్లిన ప్రతిసారి

తాజాగా ది టెలిగ్రాఫ్‌తో మైకెల్‌ హోల్డింగ్‌ మాట్లాడారు. 'నేను జమైకాలో పుట్టి పెరిగాను.అక్కడ నేను ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. ఎప్పుడైతే జమైకా నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతిసారి నేను జాత్యాహంకారాన్ని ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని. మనసును చాలా కంట్రోల్ చేసుకునేవాడిని' అని హోల్డింగ్‌ తెలిపారు. హోల్డింగ్‌ 60 టెస్టుల్లో 249 వికెట్లు, 102 వన్డేల్లో 142 వికెట్లు పడగొట్టారు.

WTC Final 2021: 'ఐసీసీ నిబంధనలు సరిగాలేవు.. ఛాంపియన్‌షిప్‌ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలి'

ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు

ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు

'యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. న్యూజిలాండ్ (1980)లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. దానిని బ‌ట్టి నేను ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉండేవాడినో మీరు అర్థం చేసుకోవ‌చ్చు. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు' అని మాజీ వెస్టిండీస్‌ పేసర్ మైకెల్‌ హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అప్పటి విండీస్ దిగ్గజ బౌలర్లలో హోల్డింగ్ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం ఆయన వ్యాఖ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో చేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు చేసిన ట్వీట్లపై ఈసీబీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

యువ‌కుడిగా ఉన్న‌ప్పుడే పోరాడి ఉంటే

యువ‌కుడిగా ఉన్న‌ప్పుడే పోరాడి ఉంటే

'ఈ విషయంలో ఒక‌వేళ నేను యువ‌కుడిగా ఉన్న‌ప్పుడే పోరాడి ఉంటే.. నా కెరీర్ ఇంత సుదీర్ఘంగా ఉండేది కాదు. అలానే నాకు ఈ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడిఉంటే వారు 'మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి' అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని' అని హోల్డింగ్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, June 22, 2021, 14:09 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X