న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు

Former NZ captain Brendon McCullum retires from all forms of cricket

ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (37) క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెకల్లమ్.. ఇక అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

<strong>గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ మృతి</strong>గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ మృతి

నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా:

నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా:

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం పలు టీ20 లీగ్‌లలో మెకల్లమ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న కెనడా గ్లోబల్ టీ20 టోర్నీలో టొరంటో నేషనల్స్ జట్టుకు మెకల్లమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ సీజన్లో మెకల్లమ్ మెరుపులు మాత్రం చూపించలేదు. 'అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలగడం గౌరవంగా ఉంది. నా ప్రదర్శన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నా. యూరో టీ20 స్లామ్‌లో నేను తిరిగి ఆడను. నా నిర్ణయాన్ని గౌరవించిన నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని మెకల్లమ్ ట్వీట్ చేశాడు.

కెరీర్ ఇంకా కొనసాగించాలని భావించా:

'నా 20 సంవత్సరాల కెరీర్లో నేను సాధించిన దాని గురించి గర్వపడుతున్నాను. నేను మొదట క్రికెట్‌లోకి వచ్చినపుడు ఏదైతే అనుకున్నానో దానికన్నా ఎక్కువే సాధించా. నా కెరీర్ ఇంకా కొనసాగించాలని భావించాను, కానీ ఇటీవలి కాలంలో కష్టంగా అనిపించింది' అని ఐసీసీ ప్రపంచకప్ వ్యాఖ్యాతలలో ఒకరైన మెకల్లమ్ పేర్కొన్నాడు.

ఎన్నో జ్ఞాపకాలు:

ఎన్నో జ్ఞాపకాలు:

'నా క్రికెట్ శైలి ఎప్పుడూ బిన్నమే. కల్లింగ్ పార్క్ నుండి లార్డ్స్ మైదానం వరకు ఆడిన మ్యాచులలో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. క్రికెట్ కోసం చేసిన త్యాగాలు చాలా గొప్పగా అనిపించాయి. నేను ప్రాతినిధ్యం వహించిన జట్లకు రుణపడి ఉన్నాను' అని మెకల్లమ్ చెప్పుకొచ్చారు. 'అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, సరైన సమయంలోనే క్రికెట్ నుంచి బయటకొచ్చా' అని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన సమయంలో తెలిపాడు.

54 బంతుల్లో సెంచరీ:

54 బంతుల్లో సెంచరీ:

మెకల్లమ్ ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెకల్లమ్ 54 బంతుల్లో 100 పరుగులుచేసి 34 ఏళ్ల రికార్డును తిరగరాసాడు. వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో; ఇంగ్లండ్‌పై 1986లో), మిస్బా వుల్ హక్ (56 బంతుల్లో; ఆస్ట్రేలియాపై 2014లో) పేరిట ఉన్న రికార్డును మెకల్లమ్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో (145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ నమోదు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో ( 27 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

జైపూర్‌ జైత్రయాత్రకు బ్రేక్.. ఆలస్యంగా పుంజుకున్న పల్టాన్‌

2008 కెరీర్‌ను మార్చేసింది:

2008 కెరీర్‌ను మార్చేసింది:

2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఆరేళ్ల పాటు మెకల్లమ్ సాధారణ ఆటగాడు. ఇక 2008 తన కెరీర్‌ను మార్చేసింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్‌గా ప్రమోట్ కావడంతో.. కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇదే ఏడాది న్యూజిలాండ్‌కు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అంతర్జాతీయ టీ20ల్లో మెరుపులు మెరిపించాడు. 101 టెస్టులలో 6453.. 260 వన్డేలలో 6083.. 71 టీ20ల్లో 2140 పరుగులు చేసాడు.

Story first published: Tuesday, August 6, 2019, 9:54 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X