న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో ఐదోసారి: బంతి తాకినా బెయిల్స్ మాత్రం పడటం లేదు (వీడియో)

ICC Cricket World Cup 2019 : David Warner's Lucky Escape During India V Australia Match || Oneindia
Fifth time in ICC World Cup 2019: ‘Zing bails’ refuse to fall

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్(56) హాఫ్ సెంచరీ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో వార్నర్ ఒక పరుగుకే పెవిలియన్‌కు చేరాల్సి ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతిని అతను డిఫెన్స్‌ ఆడాడు. దీంతో బ్యాట్‌కు తాకిన బంతి అనంతరం స్టంప్స్‌ వైపు వెళ్లింది. లెగ్‌ వికెట్‌కు తాకింది. అయితే, బంతి వేగంగానే లెగ్ వికెట్‌ను తాకినప్పటికీ.. బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు. దీంతో వార్నర్‌ అదృష్టం కొద్దీ నాటౌట్‌గా నిలిచాడు.

గత కొన్నాళ్లుగా వికెట్లకు, వాటిపై ఉండే బెయిల్స్‌కు ఎల్‌ఈడీ లైట్స్‌ అమర్చుతున్న సంగతి తెలిసిందే. దీంతో బంతి వికెట్లకు తాకినా కొన్నిసార్లు బెయిల్స్‌ కదలకపోవడంతో పాటు రనౌట్‌లు, స్టంపౌట్ల సమీక్షలకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే ఈ మధ్య కాలంలో ఎల్‌ఈడీ అమర్చిన బెయిల్స్‌ కూడా బంతి తాకినప్పటికీ కింద పడటం లేదు.

దీంతో బౌలర్లు విస్మయానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో ఇలాంటి ఘటనలు ఐదు జరిగాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం...

భారత్‌ Vs ఆస్ట్రేలియా

భారత్‌ Vs ఆస్ట్రేలియా

ఓవల్‌ వేదికగా ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛేదనకు దిగిన డేవిడ్‌ వార్నర్‌ బుమ్రా వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికే బౌల్డయ్యాడు. బుమ్రా వేసిన తొలి బంతిని అతను డిఫెన్స్‌ ఆడాడు. దీంతో బ్యాట్‌కు తాకిన బంతి అనంతరం స్టంప్స్‌ వైపు వెళ్లింది. లెగ్‌ వికెట్‌కు తాకింది. అయితే, బంతి వేగంగానే లెగ్ వికెట్‌ను తాకినప్పటికీ.. బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు. దీంతో వార్నర్‌ అదృష్టం కొద్దీ నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్‌ Vs బంగ్లాదేశ్‌

ఇంగ్లాండ్‌ Vs బంగ్లాదేశ్‌

కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 46వ ఓవర్‌ వేసిన స్టోక్స్‌ బౌలింగ్‌లో సైఫుద్దీన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆ ఓవర్‌లో మూడోబంతి బ్యాట్స్‌మన్‌కు తాకి అది వికెట్లపై పడింది. బెయిల్స్‌ కింద పడక పోవడంతో సైఫుద్దీన్‌ నాటౌట్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌ Vs శ్రీలంక

న్యూజిలాండ్‌ Vs శ్రీలంక

ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన నాలుగో బంతి కరుణరత్నే భారీ షాట్‌‌కు యత్నించాడు. బంతి బ్యాట్‌కు తగిలి నేరుగా వికెట్లకు తగిలింది. అయితే, బంతి తగిలిన అనంతరం వికెట్లపై ఉన్న బెయిల్స్‌ పైకి లేచి మళ్లీ అలాగే కుదురుకున్నాయి. దీంతో అంఫైర్లకి సైతం ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో కరుణరత్నే నాటౌట్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్‌

ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ కూడా అచ్చం ఇలానే తప్పించుకున్నాడు. మిచెల్‌స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి గేల్‌ ఎల్బీ అయినట్టు అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో గేల్ రివ్యూకి వెళ్లడంతో అందులో బంతి వికెట్లను తాకినట్లు తేలింది. మరోవైపు బెయిల్స్‌ పడకపోవడంతో పాటు ఆ బంతి ఎల్బీ కాదని తేలింది. దీంతో గేల్ నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్‌ Vs దక్షిణాఫ్రికా :

ఇంగ్లాండ్‌ Vs దక్షిణాఫ్రికా :

వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్‌ రషీద్‌ వేసిన 11వ ఓవర్‌‌లో ఇలాగే జరిగింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న క్వింటన్‌ డికాక్‌ ఐదో బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్‌ అంచుకు తాకిన బంతి స్టంప్స్‌కు తాకి బౌండరీ చేరింది. అయితే బెయిల్స్‌ గాల్లోకి లేవడంతో పాటు లైట్స్‌ వెలగాయి. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వికెట్‌ తీసిన సంబరాల్లో మునిగిపోయారు. కాకపోతే బెయిల్స్‌ కిందపడకపోవడంతో డికాక్‌ నాటౌట్‌గా మిగిలాడు.

Story first published: Monday, June 10, 2019, 12:17 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X