న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ షమీ భార్యపై మండిపడుతున్న ఫ్యాన్స్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

 Fans Troll on Mohammed Shamis wife Hasin Jahan over posts dance video on Instagram

కోల్‌కతా: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసిన్ జహాన్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకేం జరిగిందంటే.. మోడల్, నటి అయిన హసిన్ ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇటీవల షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు ఆమెపై మాటల దాడికి దిగారు.

క్షమాపణలు చెప్పాలంటూ..

దానికి తోడు ఇటీవల రోహిత్ శర్మతో ఇన్‌స్టా లైవ్‌‌లో షమీ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. దీంతో తమ అభిమాన పేసర్‌ ఇబ్బందులకు ఆమెనే కారణమని ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ కామెంట్లతో దాడికి దిగారు. షమీపై చేసిన ఆరోపణలు అసత్యమని తెలుపుతూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది షమీతో విడిపోయి చిన్నపాప జీవితాన్ని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

షమీపై సంచలన ఆరోపణలు..

షమీపై సంచలన ఆరోపణలు..

రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హాసిన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

 చచ్చిపోవాలనుకున్నా..

చచ్చిపోవాలనుకున్నా..

రోహిత్‌తో ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని షమీ ఆవేదనకు గురైన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, ప్రతీ విషయం మీడియాలో సెన్సేషన్ కావడం, అదే సమయంలో తాను రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తీవ్రంగా బాధపడ్డానన్నాడు. ఈ ప్రమాదం కూడా ఐపీఎల్‌కు ముందే 10-12 రోజుల ముందే జరగడంతో తన కెరీర్‌ గందరగోళంలో పడిందన్నాడు. ఈ వరుస సమస్యలతో అల్లాడిన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు.

 నా ఫ్యామిలీ లేకుంటే..

నా ఫ్యామిలీ లేకుంటే..

‘రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. అప్పుడే కుటుంబ సమస్యలు, దానికి తోడు రోడ్డు ప్రమాదం. అది కూడా ఐపీఎల్‌కు 10-12 రోజుల ముందు. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ సమయంలో నా కుటుంబమే అండగా లేకుంటే ఈ రోజు నేనిలా ఉండేవాడిని కాదు. మళ్లీ క్రికెట్ ఆడేవాడిని కాదు. వరుసగా ఎదురైన సమస్యలతో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. కానీ నా కుటుంబం మద్దతుగా నిలవడంతో సమస్యల నుంచి గట్టెక్కా. వ్యక్తిగత సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో క్రికెట్‌పై ఆలోచన కూడా రాలేదు. మేమంతా అప్పుడు 24వ అంతస్థులో ఉండేవాళ్లం. నేను బాల్కనీ నుంచి దూకేస్తానేమోనని నా కుటుంబం ప్రతీ క్షణం భయపడేది. నా సోదరుడు చాలా మద్దతుగా నిలిచాడు. నా ఫ్రెండ్స్ 24 గంటలు నాతోనే ఉండేవారు.'అని షమీ తన బాధను పంచుకున్నాడు.

ఎంత సాధించినా పెళ్లెప్పుడు.. పిల్లలను ఎప్పుడు కంటావని అడిగేవారు: సానియా

Story first published: Thursday, May 7, 2020, 13:22 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X