న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత బౌలింగ్‌లో అసలు పేస్ ఉండేది కాదు.. పాక్ బ్యాటర్లు హెల్మెట్ లేకుండా ఆడేవారు: మాజీ క్రికెటర్

Fans slams Salman Butt after he says Pakistan openers didnt fear Indian pacers

న్యూఢిల్లీ: భారత పేస్ బౌలింగ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో అంతగా పేస్ ఉండేది కాదన్నాడు. దాంతో పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్లు సయీద్ అన్వర్, అమీర్ సోహైల్‌లు హెల్మెట్ కూడా ధరించకుండా ఆడేవారని గుర్తు చేశాడు. తాజాగా
క్రిక్ బ్రిడ్జ్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిన్ అఫ్రిది ఓపెనర్‌గా ఎందుకు బరిలోకి దిగలేదో సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

హెల్మెట్ లేకుండా..

హెల్మెట్ లేకుండా..

'గతంలో భారత పేస్ బౌలింగ్‌లో మెరుగైన పేసర్లు ఉండేవారు కాదు. అందుకే పాకిస్థాన్ ఓపెనర్లు అయిన సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్‌లు హెల్మెట్ లు పెట్టుకోకుండా కేవలం క్యాప్ ధరించి బ్యాటింగ్ చేసేవారు. మ్యాచ్ మధ్య‌లో స్పిన్నర్ల బౌలింగ్ సమయంలో హెల్మెట్ లేకుండా ఆడటం సాధారణమే. కానీ ఓపెనర్లు కూడా హెల్మెట్ లేకుండా ఆడటమనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినా మా దిగ్గజ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను లైట్ తీసుకునేవారని, వారి బౌలింగ్ అంత వేగంగా ఉండదనే అలా చేసేవారు.'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

అందుకే అఫ్రిది ఓపెనర్‌గా కొనసాగలేదు..

అందుకే అఫ్రిది ఓపెనర్‌గా కొనసాగలేదు..

పాకిస్థాన్ విధ్వంసకర ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఓపెనర్‌గా ఎందుకు కొనసాగలేదనే ప్రశ్నకు సల్మాన్ బట్ వివరణ ఇచ్చాడు.'అఫ్రిది భాయ్ మెరుపులు మెరిపించిన రోజుల్లో గిల్ క్రిస్ట్, సనత్ జయసూర్య, కలువితరణ వంటి హిట్టర్లు ఓపెనర్లుగా వచ్చి దూకుడుగా ఆడేవారు. అఫ్రిది కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్ గా వచ్చాడు. కానీ తర్వాత అతనే తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నాడు. పాకిస్థాన్ జట్టులో మిస్బా ఉల్ హక్ యుగం మొదలైన తర్వాత అఫ్రిది ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. తన స్థానాన్ని అఫ్రిదియే మార్చుకున్నాడు.

కెప్టెన్ అయిన తర్వాత కూడా..

కెప్టెన్ అయిన తర్వాత కూడా..

అతను పాకిస్థాన్ కు రెండేళ్లు సారథిగా ఉండి కూడా ఓపెనర్‌గా రాలేదు. వాస్తవానికి ప్లేయర్లు తమ బ్యాటింగ్ స్థానాలపై నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఉండదు. కానీ కెప్టెన్‌గా ఉండి కూడా అఫ్రిది తాను ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. జట్టు పరిస్థితులను బట్టి అఫ్రిది తన స్థానాన్ని మార్చుకునేవాడు.' సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా ఫ్యాన్స్ ఫైర్..

టీమిండియా ఫ్యాన్స్ ఫైర్..

భారత పేస్ బౌలర్లను తక్కువ చేస్తూ కామెంట్లు చేసిన భట్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. యూట్యూబ్ ఛానెళ్లలో ఆదాయం పెంచుకోవడానికే ఇలాంటి పనికిమాలిన మాట్లాడటంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఆరితేరారని, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. భారత బౌలింగ్‌లో పసలేనిదే మూడు ప్రపంచకప్‌లు సాధించారా? అని సల్మాన్ బట్‌ను ప్రశ్నిస్తున్నారు.

Story first published: Wednesday, October 12, 2022, 13:16 [IST]
Other articles published on Oct 12, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X