న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 టైమింగ్స్ మార్చండి గంగూలీ సర్.. 7.30కి మా ఫ్యామిలీ ‘కార్తీక దీపం’ సీరియల్ చూస్తుంది!

Fans Request Sourav Ganguly To Change IPL 2020 timings for this reason
IPL 2020 : Fans Request To Change Match Timings For Karthika Deepam Serial || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ‌సీజన్ ప్రారంభానికి రంగం సిద్దమైంది. మరో 15 రోజుల్లో యూఏఈ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. మరికొద్ది గంటల్లోనే షెడ్యూల్ కూడా రానుంది. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరుగుతాయని ప్రకటించింది. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లకు ప్లాన్ చేస్తుండగా.. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

విభేధాలు రాకుండా చూడండి సర్..

సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మాను ట్యాగ్ చేస్తూ పవిత్రపు శివ చరణ్ అనే యూజర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయించడంతో పాటు అతని బాధను తెలియజేస్తుంది. ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. ఎందుకంటే 7.30 pmకు మా ఫ్యామిలీ ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తుంది. మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి సర్'అని స్టార్ మాతో పాటు చెన్నై ఐపీఎల్‌లకు ట్యాగ్ చేశాడు.

మా బాధ అదే బ్రదర్..

ఇక ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఫన్నీ మీమ్స్‌తో జోక్స్ పేలుతున్నాయి. ‘గంగూలీ సర్.. ఐపీఎల్ డై హార్డ్ ఫ్యాన్ బాధను అర్థం చేసుకోండి సర్..'అని ఒకరంటే.. కార్తీక దీపమా.. మజాకానా? అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరూ తమ బాధ కూడా అదే బ్రదర్.. ఈ కార్తీక దీపం ఎవరిని ప్రశాంతంగా ఐపీఎల్ చూడనివ్వదంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరూ మొబైల్‌లో చూడొచ్చు బ్రో అని సలహాలిస్తున్నారు. ఈ సూచనలపై స్పందించిన సదరు నెటిజన్ టీవీలో చూస్తేనే కిక్ ఉంటుంది బ్రో అని కామెంట్ చేస్తున్నారు.

స్పందించిన స్టార్ మా..

స్టార్ ఇండియా గ్రూప్‌కే చెందిన స్టార్ మాలో ఈ కార్తీకదీపం ప్రసారం అవుతుంది. తెలుగు ప్రజల ఆదరణను విశేషంగా ఆకట్టుకుంది. సీరియల్ చూడని వారికి కూడా అందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు తెలిసేలా ప్రాచూర్యం పొందింది. ఇక శివ చరణ్ విన్నపంపై స్పందించిన స్టార్‌మా.. ఇది చాలా నిజాయితీతో కూడి రిక్వెస్ట్ అంటూ కామెంట్ చేసింది. దీనిపై కూడా స్పందించిన శివచరణ్.. ‘స్టార్ మా మీరైనా స్టార్ ఇండియాకు చెప్పండి. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 8గంటలకు ప్రారంభించాలి'అని కోరాడు.

 వ్యూయర్ షిప్ కోసమే మార్పు..

వ్యూయర్ షిప్ కోసమే మార్పు..

ఇక లీగ్ వ్యూయర్‌షిప్ పెంచుకునే క్రమంలోనే మ్యాచ్ టైమింగ్స్ మార్చినట్లు తెలుస్తోంది. 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లు సాధారణంగా రాత్రి 11.30 లేదా 11.45కు ముగుస్తాయి. ఒక్కోసారి అర్థరాత్రి కూడా దాటుతుంది. దీంతో మ్యాచ్‌లు ఆఖరి వరకూ చూడటం కొంత మంది ఇబ్బందికి గురువుతున్నారు. ఉదయం త్వరగా లేచి వారి పనులు చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి ముగిసే మ్యాచ్‌లకు వ్యూయర్‌‌షిప్ తగ్గిపోతోందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ కూడా బోర్డు ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ సీజన్ మ్యాచ్ టైమింగ్స్‌ల్లో మార్పులు చేశారు. గంగూలీ కూడా ఈ సీజన్ ఐపీఎల్ వ్యూయర్ షిప్ రికార్డ్స్ బద్దలుకొడుతుందన్నారు.

Story first published: Friday, September 4, 2020, 18:11 [IST]
Other articles published on Sep 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X