Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజయ్.. నాన్ క్రికెటర్స్‌తో ఎలా భోజనం చేస్తున్నారు? సాలె అంటూ మంజ్రేకర్.. (వైరల్ వీడియో)

‘Saale’, Says Sanjay Manjrekar After Presenter Takes A Dig At Him In Restaurant

హైదరాబాద్ : టీమిండియా మాజీక్రికెటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా విమర్శలపాలవుతుంటాడు. తన నోటి దురుసుతో ఎవరినో ఒకరిని ఏదో అంటూ వివాదాలు కొనితెచ్చుకుంటాడు.

గతంలో ట్విటర్ వేదికగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్‌లను చులకన చేసి వారితో చివాట్లు తిన్నాడు. ఇక తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పడంలో కూడా ఈ మాజీక్రికెటర్ కమ్ కామెంటేటర్ ముందుంటాడు.

హర్షభోగ్లే చిన్నబుచ్చుకునేలా..

హర్షభోగ్లే చిన్నబుచ్చుకునేలా..

బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్మాత్మక డేనైట్ టెస్ట్ సందర్భంగా సహచర వ్యాఖ్యాత హర్షా భోగ్లే చిన్నబుచ్చుకునేలా మాట్లాడి సంజయ్ విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ నేపథ్యంలో పింక్‌ బాల్‌ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు. ప్రధానంగా బంతి ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే కానీ తెలియదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. దీనికి వెంటనే స్పందించిన మంజ్రేకర్ ఈ విషయం నువ్వే అడగాలి. ‘మేం ఓ సాధారణ క్రికెట్‌ మాత్రమే ఆడాం. మాకు ఆ అర్హత లేదు'అని వ్యంగ్యంగా మాట్లాడాడు.

హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగడంతో చివరకు తన తప్పును తెలుసకొని క్షమాపణలు తెలిపాడు.

ఇప్పుడు బ్రాడ్ కాస్టర్ టీమ్ మజాక్..

ఇప్పుడు బ్రాడ్ కాస్టర్ టీమ్ మజాక్..

భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్ తొలి వన్డే ముగిసిన అనంతరం బ్రాడ్ కాస్టర్ టీమ్‌తో డిన్నర్‌కు వెళ్లాడు. అయితే వారు హర్షా భోగ్లే‌తో నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ మంజ్రేకర్‌ను ఆటపట్టించారు. దానికి సంజయ్ కూడా ఫన్నీవేలోనే సమాధనామిచ్చాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

 ఇంతకి ఆ వీడియోలో ఏం ఉందంటే..

ఇంతకి ఆ వీడియోలో ఏం ఉందంటే..

బ్రాడ్ కాస్ట్‌ర్‌లోని ఓ వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తూ మొత్తం నలుగురం భోజనం చేయడానికి వచ్చాం. మాతో గ్రేట్ క్రికెటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఉన్నారని తెలిపాడు. అనంతరం సంజయ్‌నుద్దేశించి‘సర్ మీరు నాన్ క్రికెటర్స్ అయిన మాతో భోజనం చేయడానికి ఎలా వచ్చారు?'అని హర్షా భోగ్లే వివాదాస్పద ఘటనను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. దీనికి మంజ్రేకర్ కూడా నవ్వుతూ.. ‘సాలే .. మీరు చూసినట్లుగా నాక్రికెటర్లు నేను చూడటంలో అంతరం ఉంది.'అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

జడేజా Vs మంజ్రేకర్

జడేజా Vs మంజ్రేకర్

గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా రవీంద్ర జడేజా, సంజయ్ మంజ్రేకరల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. రవీంద్ర జడేజా అరకొర ఆటగడంటూ మంజ్రేకర్ ఎద్దేవా చేయగా.. 'నీ కంటే ఎక్కవ మ్యాచ్‌లు నేనే ఆడాను.. నీ నోటి విరేచనాలను ఆపు' అంటూ జడేజా ఘటుగా బదులిచ్చాడు. మంజ్రేకర్‌పై జడేజా అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక వరల్డ్ కప్ సెమీఫైనల్లో జడేజా అద్భుత పోరాటంతో మంజ్రేకర్ తన మాటలను వెనక్కు తీసుకున్నాడు. దీంతో ఆ వివాదానికి తెరపడింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా కూడా ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా సంభాషించుకున్నారు. కాకపోతే తిట్టుకోకుండా స్నేహపూర్వకంగా మెలిగారు. రెండో టీ20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బ్యాట్స్‌మెన్‌కు ఎలా ఇస్తారని సంజయ్ ప్రశ్నించగా.. ఎవరికివ్వాలో చెప్పవా అంటూ జడేజా అడిగాడు. దీనికి సంజయ్ నీకు లేదా బుమ్రాకు ఇవ్వాలన్నాడు.

Story first published: Friday, February 7, 2020, 13:26 [IST]
Other articles published on Feb 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+