న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్‌ జోయెల్ విల్సన్ 8 తప్పుడు నిర్ణయాలు.. చెత్త అంపైరింగ్‌ రికార్డు సమం

Fan edits Joel Wilson’s Wikipedia page, Hilarious Memes Flood Twitter After Joel Wilsons Umpiring Howlers

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభ టెస్టులో ఫీల్డ్‌ అంపైరింగ్‌ నిర్ణయాలు దారుణంగా ఉన్నాయి. అంపైర్‌లు జోయల్‌ విల్సన్‌, అలీమ్‌ దార్‌లు పదే పదే తప్పుడు నిర్ణయాలు ప్రకటించారు. ఇద్దరు కలిసి ఏకంగా 15 తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ తటస్థ అంపైరింగ్‌ వల్లే ఇలా జరుగుతుందని ధ్వజమెత్తాడు.

పొలార్డ్‌కు జరిమానా.. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత

వెస్టిండీస్‌కు చెందిన జోయల్‌ విల్సన్‌ యాషెస్‌-2019 తొలి టెస్టులో పదే తప్పుడు నిర్ణయాలు ప్రకటించాడు. విల్సన్‌ ప్రకటించిన నిర్ణయాల్లో ఎనిమిది డీఆర్‌ఎస్‌లో తప్పని తేలాయి. దీంతో జోయల్‌ విల్సన్‌ ఒక చెత్త రికార్డు సమం చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది నిర్ణయాలు తప్పుగా తేలడం డీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఇదే రెండోసారి మాత్రమే. 2016లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టులో శ్రీలంక అంపైర్‌ ఇలా ఎనిమిది తప్పుడు నిర్ణయాలు ప్రకటించాడు.

డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతోంది. విల్సన్‌, అలీమ్‌ దార్‌ కలిసి 15 తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. జోయల్‌ విల్సన్‌ తప్పుడు నిర్ణయాలు వెల్లడించడంతో అతను ఫీల్డ్‌ అంపైరింగ్‌కు పనికిరాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో నుంచి వచ్చిన జోయల్‌ విల్సన్‌ ఒక బ్లైండ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అంపైర్‌ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌.. సింధు, సైనాలకు కఠినమైన డ్రా

అన్ని ఫార్మాట్లకు అంపైర్‌గా వ్యవహరిస్తున్న విల్సన్‌.. అసలు ఫీల్డ్‌ అంపైర్‌గా చేసే అర్హత లేదంటున్నారు. అంతేకాదు విల్సన్‌ వికీపీడియా పేజీని కూడా అభిమానులు చేంజ్ చేశారు. 'బ్లైండ్‌ అంపైర్‌' అని ఎడిట్ చేశారు. మరోవైపు ట్విటర్‌లో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో లార్డ్స్‌లో జరిగే రెండో టెస్టుకు విల్సన్‌ను టీవీ అంపైర్‌గా పరిమితం చేసే అవకాశం ఉంది.

Story first published: Tuesday, August 6, 2019, 17:08 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X