న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌.. సింధు, సైనాలకు కఠినమైన డ్రా

Badminton World Championship 2019: PV Sindhu, Saina Nehwal face tough opponents in BWF releases draw

స్విట్జర్లాండ్‌: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు కఠినమైన డ్రా ఎదురైంది. సింధు, సైనాలకు క్వార్టర్‌ ఫైనల్లో గట్టి సవాల్‌ ఎదురుకానుంది. ఈనెల 19 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ నగరంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి సోమవారం కౌలాలంపూర్‌లో 'డ్రా' విడుదల చేశారు.

ట్విటర్‌లో వైరల్.. 'బిగ్గెస్ట్‌ బాస్‌'తో విరాట్ కోహ్లీ

ఐదో సీడ్‌ సింధు, ఎనిమిదవ సీడ్‌ సైనాలకు తొలి రౌండ్లో బై లభించింది. వీరితో పాటు సీడింగ్‌ పొందిన 16 మంది క్రీడాకారిణులకు తొలి రౌండ్‌లో బై లభించడంతో.. అందరూ నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. డ్రా ప్రకారం సైనాకు రెండో రౌండ్‌లో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌), ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మిచెల్లి లీ (కెనడా) లేదా ఫిత్రియాని (ఇండోనేసియా)లలో ఒకరు ప్రత్యర్థిగా ఎదురవ్వొచ్చు. ఇక క్వార్టర్‌ ఫైనల్ చేరితే.. నాలుగో సీడ్‌ చెన్‌ యు ఫె (చైనా) లేదా బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)లలో ఒకరితో సైనా తలపడే అవకాశం ఉంది. సెమీస్‌ చేరితే ప్రపంచ నంబర్‌వన్‌ అకానె యామగుచి (జపాన్‌) లేదా ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)లు ఎదురవుతారు.

సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటే.. మాజీ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) రూపంలోప్రమాదం ఎదురుకానుంది. సెమీస్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఒకుహారా (జపాన్‌) లేదా ఆరో సీడ్‌ హి బింగ్‌జియావో (చైనా)లలో ఒకరు ప్రత్యర్థిగా ఉండనున్నారు. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరుకుంటే పతకం ఖాయమవుతుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇప్పటి వరకు 2 రజతాలు (2017, 2018).. 2 కాంస్యాలు (2013, 2014) సాధించింది. సైనా ఒక రజతం (2015), ఒక కాంస్యం (2017) గెలుచుకుంది.

<strong>'మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే బహుశా మేము గెలిచే వాళ్లం'</strong>'మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే బహుశా మేము గెలిచే వాళ్లం'

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో నుయెన్‌ (ఐర్లాండ్‌)తో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ తలపడనున్నాడు. శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశం ఉంది. క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) రూపంలో అసలైన ప్రత్యర్థి ఉంటాడు. ఇక హీనో (ఫిన్‌లాండ్‌)తో ప్రణయ్‌, జేసన్‌ ఆంథోనీ (కెనడా)తో సాయిప్రణీత్‌, కీన్‌ యూ (సింగపూర్‌)తో సమీర్‌వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీకి బై లభించింది.

Story first published: Tuesday, August 6, 2019, 13:54 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X