న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొలార్డ్‌కు జరిమానా.. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత

India vs West Indies 2019: Kieron Pollard fined, gets one demerit point for disobeying umpires instruction

లాడర్‌హిల్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ కీర‌న్ పొలార్డ్‌కు జరిమానా పడింది. ఆదివారం ఫ్లోరిడాలో భారత్‌తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో అంపైర్ సూచనలను ధిక్కరించిన కారణంగా పొలార్డ్‌కు జరిమానా విధించారు. అతని మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించారు. అంతేకాదు పొలార్డ్‌ ఖాతాలో మ్యాచ్ రిఫరీ ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించాడు.

ట్విటర్‌లో వైరల్.. 'బిగ్గెస్ట్‌ బాస్‌'తో విరాట్ కోహ్లీట్విటర్‌లో వైరల్.. 'బిగ్గెస్ట్‌ బాస్‌'తో విరాట్ కోహ్లీ

రెండవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ను మైదానంలోకి అనుమతించమని పదేపదే అంపైర్‌ను పోలార్డ్ అడిగాడు. ఓవర్ తర్వాత అనుమతిస్తామని అంపైర్‌ తెలిపాడు. కానీ పొలార్డ్ ఆ సూచనలను పాటించకపోవడంతో మ్యాచ్ రిఫరీకి అంపైర్‌లు ఫిర్యాదు చేశారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.4ను (అంపైర్ సూచనలను ధిక్కరించడం) ఉల్లంఘించిన కారణంగా పొలార్డ్‌కు జరిమానా పడింది. పొలార్డ్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు.

తొలి టీ20లో అరంగేట్రం చేసిన భారత యువ పేస్ బౌలర్ నవ్‌దీప్ సైనీ దురుసైన ప్రవర్తన కనబరిచాడన్న కారణంతో అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు. ఆ మ్యాచ్‌లో విండీస్ మొదటి బ్యాటింగ్ చేస్తుండగా.. నికోలస్ పూరన్‌ను సైనీ ఔట్ చేశాడు. పూరన్ మైదానం వీడుతున్న సమయంలో సైనీ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ దురుసైన ప్రవర్తన కనబరిచాడు. సైనీ సైతం అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండానే మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఓ డీమెరిట్ పాయింట్ విధించాడు.

యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతంయాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది. ఈ రోజు రాత్రి గయానాలో మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌ అనంతరం విండీస్ గడ్డపై టీమిండియా మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది.

Story first published: Tuesday, August 6, 2019, 15:05 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X