న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం సౌతాఫ్రికా.. మోర్గాన్ సిక్సర్ల మోత‌తో ఓటమి తప్పలేదు.!

Eoin Morgan help England gun down 223 to clinch series vs South Africa

సెంచూరియన్‌: పాపం సౌతాఫ్రికా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా విజయాన్నందుకోలేకపోయింది. తొలి టీ20లో అద్భుత బౌలింగ్‌తో విజయాన్నందుకున్న ఆ జట్టు రెండో టీ20లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన ఫైనల్ టీ20‌లో ప్రత్యర్ధి బ్యాట్స్‌మన్ సిక్సర్ల మోతతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమికి తలొగ్గింది.

ఈ మూడు టీ20ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఉత్కంఠకే ఊపిరి ఆడనివ్వలేదు. ఆఖరి బంతి వరకు దోబూచులాడిన విజయం చెరొకసారి దక్కింది. నిర్ణయాక మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలి రెండు టీ20ల మాదిరే ఫలితం కోసం ఆఖరి ఓవర్‌ వరకూ నిరీక్షించాల్సి వచ్చింది. కానీ.. వాటి మాదిరి ఉత్కంఠ రేపలేదు.

మోర్గాన్, స్టోక్స్..

మోర్గాన్, స్టోక్స్..

24 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడ్డారు. కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో కలిపి 52 పరుగులు రాబట్టారు. ఈక్రమంలో స్టోక్స్‌ అవుటైనా దూకుడు ఆపని మోర్గాన్‌ వరుస సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో ఈ పోరులో ఐదు వికెట్లతో సులువుగా గెలుపొందిన ఇంగ్లండ్‌ జట్టు 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

చెలరేగిన క్లాసెన్..

చెలరేగిన క్లాసెన్..

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. క్లాసెన్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) హాఫ్‌ సెంచరీ చేశాడు. బవుమా (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49), డి కాక్‌ (24 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 35), మిల్లర్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్‌) తలో చేయి వేశారు. కర్రాన్‌, స్టోక్స్‌ చెరో రెండో వికెట్లు పడగొట్టారు.

మార్చి 25న ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్.. కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్‌లోనే.. కెప్టెన్‌గా ధోని!

ఐదు బంతులు మిగిలుండగానే..

ఐదు బంతులు మిగిలుండగానే..

223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (7) వికెట్‌ను ఇంగ్లండ్‌ త్వరగా కోల్పోయింది. కానీ బెయిర్‌ స్టో (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), కెప్టెన్‌ మోర్గాన్‌ (22 బంతుల్లో 7 సిక్సర్లతో 57 నాటౌట్‌), బట్లర్‌ (29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) చెలరేగారు. వారికి స్టోక్స్‌ (12 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 22) ధాటి ఇన్నింగ్స్‌ తోడుకావడంతో ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ 226/5 స్కోరుతో విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు మోర్గాన్‌కే దక్కాయి.

 ఘన ముగింపు..

ఘన ముగింపు..

ఈ గెలుపుతో ఇంగ్లండ్ రెండు నెలల సౌతాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్ ఘనంగా ముగించింది. టెస్ట్ సిరీస్ 3-1తో, టీ20 సిరీస్‌ను 2-1తో గెల్చుచుకున్న ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌ను మాత్రం 1-1తో సమం చేసుకుంది.

Story first published: Monday, February 17, 2020, 8:57 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X