న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్చి 25న ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్.. కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్‌లోనే.. కెప్టెన్‌గా ధోని!

IPL All Star Game to take place on March 25 in Mumbai

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)- 2020 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్ నిర్వహణపై ఉహాగానాలు జోరందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆల్ స్టార్ గేమ్ కూడా ముంబై వేదికగానే మెగా టోర్నీ ఆరంభానికి నాలుగు రోజుల ముందు మార్చి 25న నిర్వహించనున్నారనే ప్రచారం జోరందుకుంది. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఈ సీజన్‌కు ముందు ఎనిమిది జట్ల ఆటగాళ్లను విడదీసి ఆల్‌స్టార్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ మార్చి 25నే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. దీనికోసం బీసీసీఐ కూడా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

<strong>వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచానా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)</strong>వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచానా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)

ఆల్ స్టార్ గేమ్ అంటే..?

ఆల్ స్టార్ గేమ్ అంటే..?

ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్‌ ఐపీఎల్‌కు కొత్త. కానీ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఈ తరహా మ్యాచ్‌లను ఎక్కువగా నిర్వహిస్తుంది. ఇక క్రికెట్‌లో వరల్డ్ ఎలెవన్ , ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఈ తరహా కాన్సెప్ట్‌కు చెందినవే. ఆసియా దేశాల్లోని ఆటగాళ్లంతా ఒక జట్టైతే.. మిగతా ప్రపంచ ఆటగాళ్లంత మరో జట్టుగా తలపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్‌ల్లోని అన్ని జట్ల ఆటగాళ్లు సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ టీమ్‌లుగా విడిపోయి ఆడనున్నారు. అభిమానులకు కావాల్సిన మజా ఇవ్వనున్నారు.

ఒకేజట్టులో ధోని, కోహ్లీ, రోహిత్ ..

ఒకేజట్టులో ధోని, కోహ్లీ, రోహిత్ ..

ఈ ఆల్‌స్టార్ గేమ్ కాన్సెప్ట్‌లో భాగంగా ఐపీఎల్‌లోని మొత్తం 8 జట్ల ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక గ్రూప్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉండనుండగా.. రెండో గ్రూప్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ఉండనున్నారు.

ఇలా నాలుగు జట్లలోని కీలక ఆటగాళ్లు తుది జట్లుగా బరిలోకి దిగి పోటీపడనున్నారు. దీంతో టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే జట్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు జస్ప్రిత్ బుమ్రా, విలియమ్సన్, రషీద్ ఖాన్‌లు కూడా ఉండనున్నారు. మరో జట్టు కూడా కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అశ్విన్, ఆర్చర్, అయ్యర్, రిషబ్ పంత్‌లతో ధీటుగా ఉండనుంది.

కెప్టెన్లుగా ధోని, స్మిత్

కెప్టెన్లుగా ధోని, స్మిత్

విరాట్, రోహిత్ ఉన్న కూడా అనుభవం దృష్ట్యా సౌత్ వెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోనినే కొనసాగే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ టీమ్‌ కెప్టెన్సీకి స్టీవ్ స్మిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య పోటీ ఉన్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కే జట్టు పగ్గాలు అందొచ్చు. ఏదీ ఏమైనా ఈ ఆల్ స్టార్‌ మ్యాచ్‌తో అభిమానులకు కావాల్సిన మజా.. బోర్డు‌కు కావాల్సిన విరాళాలు పుష్కలంగా రానున్నాయి.

మార్చి 29 నుంచే ఐపీఎల్‌ షురూ.. హైదరాబాద్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

ఫ్రాంచైజీల విముఖత..

ఫ్రాంచైజీల విముఖత..

మరోవైపు ఈ ఆల్‌స్టార్‌గేమ్ కాన్సెప్ట్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార కోణంలో ఈ మ్యాచ్ వల్ల వారికి నష్టాలు వస్తాయని, అలాగే ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక జట్టుతో బంధం పెంచుకునే సెషన్స్, కలిసి ప్రయాణించే సమయాన్ని వాళ్లు కోల్పోతారని ఓ ఫ్రాంచైజీ మీడియాకు తెలిపారు. దీంతో సీజన్ ముగిసాక ఈ మ్యాచ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

ఆసియా ఎలెవన్ vs వరల్డ్ ఎలెవన్..

ఆసియా ఎలెవన్ vs వరల్డ్ ఎలెవన్..

బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా మార్చి 18,21 తేదీల్లో జరగనున్న ఆసియా ఎలెవన్ vs వరల్డ్ ఎలెవన్ మ్యాచ్‌కు నలుగురు భారత ఆటగాళ్లను పంపే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నలుగురి క్రికెటర్ల పేర్లను అపెక్స్ క్రికెట్ బాడీ త్వరలో నిర్ణయించనుందని, సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారం ఇవ్వనుందని సమాచారం.

Story first published: Sunday, February 16, 2020, 15:42 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X