న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను చాలా లక్కీ.. కరోనా టైం కలిసొచ్చింది: మోర్గాన్

 Eoin Morgan Feels Very Lucky To Spend Time With His New-Born Baby

కోల్‌కతా: ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తాను చాలా అదృష్టవంతుడినని తెలిపాడు. కరోనా పుణ్యమా లభించిన ఈ ఖాళీ సమయాన్ని ఇటీవలె జన్మించిన తన బిడ్డతో గడుపుతున్నాని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ మొదలైతే మోర్గాన్ ఈపాటికి కోల్‌కతా తరపున ఆడుతూ ఉండేవాడు.

అయితే కరోనా కారణంగా ఈ క్యాష్ లీగ్ రద్దవ్వడం.. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సి క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడటంతో స్టార్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక వెబ్‌సైట్‌తో మాట్లాడిన మోర్గాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ప్రస్తుతం ఇది ఎవరూ ఊహించని సమయమని పేర్కొన్న మోర్గాన్.. ఇటీవలే తన భార్య తారా మోర్గాన్‌ ఓ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. తన బిడ్డ వయసు మూడు వారాలేనని, తాము చాలా అదృష్టవంతులమని అన్నాడు. కఠినమైన పరిస్థితుల్లో అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నామన్నాడు. ప్రస్తుత సమయంలో శిశువుతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లక్ష్యం కరోనా వైరస్ నుంచి బయటపడడమేనని పేర్కొన్న మోర్గాన్.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు.

'ఇది చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుభవించే వరకు దీన్ని వర్ణించడం కష్టమే. మా బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూశాం. ఇది మరెక్కడా దొరకని ప్రత్యేకమైన అనుభూతి. నేను వేలాది న్యాపీలను మార్చాలి. అయినా నేను దానిని ఇష్టపడతాను. ఇప్పడు దానిని ఎంజాయ్ చేస్తున్నాను కూడా'' అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

ధోనీ ఇంతలా ప్రాక్టీస్ చేయడం గత పదేళ్లలో ఇదే తొలిసారి: సీఎస్‌కే ఫిజియోధోనీ ఇంతలా ప్రాక్టీస్ చేయడం గత పదేళ్లలో ఇదే తొలిసారి: సీఎస్‌కే ఫిజియో

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పై మోర్గాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్ 2020 సీజన్ గురించి ఇప్పటికే చాలా మాట్లాడానని తెలిపాడు. చివరిసారిగా డీకేను క్రిస్మస్ సందర్భంగా కలిసినట్లు కూడా గుర్తు చేసుకున్నాడు. మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు 2019 వన్డే ప్రపంచకప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో రసవత్తరంగా జరిగిన ఫైనల్లో బౌండరీల లెక్క ఆదారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ఫైనల్ అత్యంత నాటకీయంగా జరిగిందని తాజాగా మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Sunday, April 12, 2020, 20:21 [IST]
Other articles published on Apr 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X