న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీమర్‌ రోచ్‌ అరుదైన రికార్డు.. 1994 తర్వాత ఇదే తొలిసారి!!

England vs West Indies: Kemar Roach becomes 1st Windies bowler since Curtly Ambrose to register 200 wickets

మాంచెస్టర్‌: సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టులో వెస్టిండీస్‌ పేస్ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన విండీస్‌ బౌలర్ల జాబితాలో రోచ్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో క్రిస్ ‌వోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా రోచ్‌ 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో రోచ్‌ ఏడు వికెట్లు పడగొట్టాడు.

‌రోచ్‌ అరుదైన రికార్డు:

‌రోచ్‌ అరుదైన రికార్డు:

26 ఏళ్లలో 200 టెస్టు వికెట్ల మైలురాయిని అధిగమించిన తొలి విండీస్‌ బౌలర్‌గా కీమర్‌ రోచ్‌ రికార్డు సృష్టించాడు. చివరగా 1994లో ఆంబ్రోస్‌ ఈ ఘనత అందుకున్నాడు. 1980లో విండీస్ తరఫున గ్యారీ సోబర్స్ 200 టెస్టు వికెట్లు సాధించాడు. రోచ్‌ 59 టెస్టుల్లోనే 200 టెస్టు వికెట్లు సాధించగా.. గ్యారీ సోబర్స్‌ 80 టెస్టుల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. విండీస్ తరఫున 200 వికెట్లు సాధించిన జాబితాలో మాల్కం మార్షల్ (42), జోయెల్ గార్నర్ (44), కర్ట్లీ అంబ్రోస్ (45), లాన్స్ గిబ్స్ / ఆండీ రాబర్ట్స్ (46), మైఖేల్ హోల్డింగ్ (47), కోర్ట్నీ వాల్ష్ (58), కేమర్ రోచ్ (59), గ్యారీ సోబర్స్ (80) ఉన్నారు.

 బ్రాడ్ సుడిగాలి ఇన్నింగ్స్:

బ్రాడ్ సుడిగాలి ఇన్నింగ్స్:

నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్ల ధాటికి ఒక్కొక్కరు పెవిలియన్ దారి పడుతుంటే.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సుడిగాలి ఇన్నింగ్స్ (45 బంతుల్లో 62‌; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆడడంతో ఇంగ్లీష్ జట్టు 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విండీస్ పేసర్లలో రోచ్ నాలుగు వికెట్లు తీయగా.. గాబ్రియేల్, ఛేజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒక వికెట్ తీశాడు.

ఆదిలోనే భారీ షాక్:

ఆదిలోనే భారీ షాక్:

ఓవర్ నైట్ స్కోర్ 258/4తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జాన్‌ పోప్ (91), క్రిస్ వోక్స్ (1), కీపర్‌ జోస్ బట్లర్‌ (67), జోఫ్రా ఆర్చర్ (3) త్వరగానే ఔట్ అయ్యారు. ఈ సమయంలో బ్రాడ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 45 బంతుల్లోనే 9ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 2017 తర్వాత బ్రాడ్‌కు ఇదే తొలి హాఫ్‌సెంచరీ కావడం విశేషం. బెస్ (18), అండర్సన్ (11) అండతో బ్రాడ్‌ దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ అలవోకగా 350 పరుగుల మార్క్‌ను చేరుకున్నది. బ్రాడ్, అండర్సన్ ఔట్ అవ్వడంతో ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.

ఆసీస్ టూర్‌కు 26 మందితో కూడిన జట్టును పంపాలి: ఎమ్మెస్కే

Story first published: Saturday, July 25, 2020, 18:17 [IST]
Other articles published on Jul 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X