న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ టూర్‌కు 26 మందితో కూడిన జట్టును పంపాలి: ఎమ్మెస్కే

Would Be Ideal To Go With Large Contingent On Australia Tour says MSK Prasad

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత్ 26మందితో భారీ జట్టును పంపాలని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సూచించాడు. కరోనా కాలంలో నెట్ బౌలర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారో లేదో తెలియదని, కావున ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ బృందాన్ని పంపాలని ఆయన చెప్పాడు. సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు అడిలైడ్‌లో 14 రోజుల క్వారంటైన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్న నిబంధన ఉంది.

'ఆస్ట్రేలియా పర్యటనకు 26 మంది సభ్యులను పంపడం మంచి ఆలోచన. టీమిండియాతో పాటు భారత్‌-ఎ జట్టునూ పంపితే.. త్వరలో జట్టు తలుపు తట్టే సత్తా ఉన్న కుర్రాళ్లను పరిశీలించే అవకాశం సీనియర్లకు జట్టు వ్యూహ బృందానికి లభిస్తుంది. అంతేకాక ప్రధాన జట్టులో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే మిగిలిన ఆటగాళ్ల నుంచి ఒకరిని తీసుకోవచ్ఛు. అలానే నెట్స్‌లో యువ బౌలర్లను ఉపయోగించుకోవచ్చు' అని ఎమ్మెస్కే సూచించాడు.

సీనియర్లతో పాటు ఇండియా ఎ ఆటగాళ్లతో భారత జట్టు పటిష్టంగా ఉండాలని ఎమ్మెస్కే సూచించాడు. ఇంగ్లండ్‌తో సిరీ్‌సకు వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్లు ఇలా భారీ బలగంతోనే వెళ్లిన విషయాన్ని ఎమ్మెస్కే గుర్తు చేశాడు. 26 మందిని రెండు జట్లుగా విభజించి క్వారంటైన్‌ సమయంలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడించవచ్చన్నాడు. జట్టులోని చాలామంది క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడి నేరుగా ఆస్ట్రేలియా వెళుతున్నందున వారిలో ఎవరైనా గాయపడితే.. భారీ బృందం నుంచి ఒకరిద్దరిని ఎంపిక చేసుకోవడం కష్టం కాబోదని ప్రసాద్‌ చెప్పాడు.

ఎన్నో ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ అందుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. 1947 నుంచి భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్‌‌లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

అప్పటి సిరీస్‌లో ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో దక్కించుకుంది.

'రాజీ అస్సలు పడొద్దు.. క్రికెటర్లకి ప్రతిరోజూ వైరస్ పరీక్షలు నిర్వహించాలి''రాజీ అస్సలు పడొద్దు.. క్రికెటర్లకి ప్రతిరోజూ వైరస్ పరీక్షలు నిర్వహించాలి'

Story first published: Saturday, July 25, 2020, 16:40 [IST]
Other articles published on Jul 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X