న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో మూడో టెస్టు.. ఆదుకున్న పోప్‌, బట్లర్‌.. ఇంగ్లండ్ 258/4

England vs West Indies 3rd Test: Ollie Pope, Jos Buttler keep WI at bay with century stand

మాంచెస్టర్‌: సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టులో తొలిరోజు ఇంగ్లండ్ తడబడి నిలబడింది. ఆరంభంలో వెస్టిండీస్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లండ్.. ఒలీ పోప్‌ (91 బ్యాటింగ్‌; 142 బంతుల్లో 114), జోస్ బట్లర్‌ (56 బ్యాటింగ్‌; 120 బంతుల్లో 54, 26) కీలక భాగస్వామ్యంతో కోలుకుంది. ఈ జోడీ అభేద్యమైన అయిదో వికెట్‌కు 136 పరుగులు జోడించడంతో శుక్రవారం ఆట ఆఖరికి ఇంగ్లిష్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ (57) అర్ధసెంచరీ చేసి నిష్క్రమించగా.. డొమినిక్ సిబ్లీ (0), జో రూట్‌ (17), బెన్ స్టోక్స్‌ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

 తొలి ఓవర్‌లోనే షాక్:

తొలి ఓవర్‌లోనే షాక్:

వరుసగా మూడో టెస్టులోనూ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్.. ఆరంభం నుంచీ ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. స్వింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కరీబియన్‌ పేసర్లు విజృంభించారు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికే సిబ్లీ రూపంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కోల్పోయింది. వికెట్లపైకి దూసుకొచ్చేలా కీమర్ రోచ్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడడంలో విఫలమైన సిబ్లీ అడ్డంగా దొరికిపోయాడు. సమీక్ష కోరకుండానే అతను పెవిలియన్‌ చేరడంలో ఇంగ్లండ్‌ 1/1తో నిలిచింది. తొలి ఓవర్లోనే వికెట్‌ పడడంతో ఇంగ్లిష్‌ జట్టు ఆత్మరక్షణలో పడింది. ఓపెనర్‌ బర్న్స్‌తో పాటు కెప్టెన్‌ రూట్‌ ఆచితూచి ఆడారు. ఆఫ్‌సైడ్‌ లోగిలిలో బంతులు వేస్తూ విండీస్‌ పేసర్లు పరీక్షించినా వాళ్లు పరుగుల కోసం తొందరపడలేదు.

రూట్‌ విఫలం:

రూట్‌ విఫలం:

59 బంతులు ఆడి 17 పరుగులు చేసిన జో రూట్‌ అనూహ్యంగా రనౌట్‌ కావడం ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. రెండో టెస్టులో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను విండీస్‌ వ్యూహంతో పడగొట్టింది. రూట్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ లఫె్ట్‌హ్యాండర్‌ను కరీబియన్‌ పేసర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో పరీక్షించారు. స్వింగ్‌తో ఇబ్బంది పెట్టారు. వీటిని తట్టుకుని స్టోక్స్‌ నిలవడంతో ఇంగ్లండ్‌ 66/2తో లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత స్టోక్స్‌కు రౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేస్తూ అతడికి ఊరించే బంతులేశారు. ఈ క్రమంలో స్టోక్స్‌ ఒక అద్భుతమైన బంతికి దొరికిపోయాడు. వరుసగా రెండు బౌన్సర్లు వేసిన రోచ్‌.. ఆ తర్వాత ఓ ఇన్‌స్వింగర్‌ని సంధించగా.. బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన స్టోక్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

కార్న్‌వాల్‌ సూపర్ క్యాచ్:

కార్న్‌వాల్‌ సూపర్ క్యాచ్:

అనంతరం వెస్టిండీస్‌ జంబో ఆటగాడు కార్న్‌వాల్‌ చురుగ్గా స్పందించి ఓ సూపర్‌ క్యాచ్‌తో క్రీజులో కుదురుకున్న బర్న్స్‌ను పెవిలియన్‌ చేర్చాడు. స్పిన్నర్‌ రోస్టన్ ఛేజ్‌ బంతిని కట్‌ చేయడానికి బర్న్స్‌ ప్రయత్నించగా.. స్లిప్‌లోకి వచ్చిన క్యాచ్‌ను కార్న్‌వాల్‌ అద్భుతంగా పట్టేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 122/4తో కష్టాల్లో పడింది. ఈ సిరీస్‌లో బర్న్స్‌ను ఔట్‌ చేయడం ఛేజ్‌కు ఇది మూడోసారి కావడం విశేషం. టీ సమయానికి 131/4తో నిలిచిన ఇంగ్లిష్‌ జట్టు.. విరామం తర్వాత కాస్త పుంజుకుంది.

ఆదుకున్న పోప్:

ఆదుకున్న పోప్:

బట్లర్‌ సహకారంతో పోప్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. అతను వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోరు బోర్డు కదిలించాడు. మరోవైపు కుదురుకున్నాక బట్లర్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే పోప్‌ 77 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా.. బట్లర్‌ 104 బంతుల్లో ఈ మార్కు దాటాడు. వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న బట్లర్‌ ఎట్టకేలకు రాణించాడు. అయితే వీరిద్దరిని విడదీయడం విండీస్‌ వల్ల కాలేదు. కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది.

విఫలమైన బెన్ స్టోక్స్.. మరోసారి బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌ ఉద్యమానికి సంఘీభావం!

Story first published: Saturday, July 25, 2020, 10:48 [IST]
Other articles published on Jul 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X