Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విఫలమైన బెన్ స్టోక్స్.. మరోసారి బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌ ఉద్యమానికి సంఘీభావం!

England vs West Indies 3rd Test: Ben Stokes Clean bowled

మాంచెస్టర్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. రెండో టెస్ట్‌లో తన సూపర్ పెర్ఫామెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(20) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఫస్ట్ టెస్ట్‌లో(43, 46) పోరాడే స్కోర్లు, రెండో టెస్ట్‌లో(176, 78 నాటౌట్) విజయాన్నందించే పరుగులతో చేసిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆ జోరు కొనసాగించలేకపోయాడు.

47 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ కొంత పోరాడినా.. విండీస్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయాడు. కీమర్ రోచ్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 45 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 117 రన్స్ చేసింది. క్రీజులో రోరీ బర్న్స్ (54), ఓల్లీ పోప్(16) ఉన్నారు. స్టోక్స్‌తో పాటు డామ్ సిబ్లీ(0), కెప్టెన్ జోరూట్(17) దారుణంగా విఫలమయ్యారు. ఇందులో రెండు వికెట్లు రోచ్ తీయగా.. జోరూట్ రనౌటయ్యాడు.

జాతి వివక్షకు సంఘీభావం..

అమెరికా నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంతాప సూచకంగా ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోగోతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందే ఆటగాళ్లంతా మోకాలిపై కూర్చొని సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఇక మూడో టెస్ట్ ఆరంభానికి ముందు కూడా ఇదే తరహా నిరసను వ్యక్తం చేశారు. అప్పటిలానే మోకాలిపై కూర్చొని పిడికిలి పైకెత్తి జాతి వివక్షకు వ్యతిరేకంగా నినదించారు.

రెడ్ క్యాప్‌లతో..

ఇక ఈ మ్యాచ్‌లో రెడ్ ఫర్ రూత్ ప్రచారంలో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభానికి ముందు రెడ్ క్యాప్‌లు ధరించారు. ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చడంలో భాగంగా ఇలా చేశారు. ఇక ఆండ్రూ స్ట్రాసే బెల్ కొట్టి మ్యాచ్‌ను ఆరంభించగా.. ఆటగాళ్లంతా రెడ్ క్యాప్‌లు ధరించి మద్దతు తెలిపారు.

ఎరుపుతో నిండిపోనున్న మైదానం..

ఇక ఆట రెండో రోజు శనివారం మైదానం మొత్తం ఎరుపు వర్ణంతో నింపనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రత్యేక లోగోలున్న రెడ్ కలర్ క్యాప్స్, టీషర్ట్స్ ధరిస్తారు. స్టంప్స్, బౌండరీ, బోర్ట్స్, స్టేడియంలోని హోర్డింగ్స్ కూడా రెడ్ కలర్‌తో కనిపించనున్నాయి. క్యాన్స‌ర్‌తో చనిపోయిన తన భార్య రూత్ పేరు మీద స్ట్రాస్ ఈ ఫౌండేషన్ ప్రారంభించాడు. క్యాన్సర్ కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారికి ఈ ఫౌండేషన్ ఆపన్న హస్తం అందిస్తోంది.

సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!

Story first published: Friday, July 24, 2020, 19:55 [IST]
Other articles published on Jul 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+