న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠగా సాగుతున్న ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్.. విజయానికి 3 వికెట్ల దూరంలో రూట్ సేన!

England vs West Indies 2nd Test: Sam Curran strike brings England closer to victory

మాంచెస్టర్‌: ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఉత్కంఠగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా ఆతిథ్య జట్టు పోరాడుతుండగా.. డ్రా కోసం పర్యాటక జట్టు పరితపిస్తోంది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు విజయానికి కావాల్సిన 3 వికెట్ల కోసం ఆతిథ్య బౌలర్లు వేట మొదలెట్టారు. రివర్స్ స్వింగ్, గుడ్ లెంగ్త్, షాట్ పిచ్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జాసన్ హోల్డర్(17 బ్యాటింగ్), కేమర్ రోచ్(0 బ్యాటింగ్) డ్రా కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం 59 ఓవర్లకు విండీస్ 164/7 పరుగులు చేసింది. ఓటమిని తప్పించుకోవాలంటే కరేబియన్లు ఇంకా 25 ఓవర్లు ఆడాలి.

టాపార్డర్.. టపటపా..

టాపార్డర్.. టపటపా..

ఇక ఇప్పటి వరకు బాధ్యతాయుతంగా ఆడిన విండీస్ టాపార్డర్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిన ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కాంప్‌బెల్‌(4)ను స్టువర్ట్ బ్రాడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్(12)ను క్రిస్ వోక్స్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. షైహోప్(7)ను బ్రాడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరికొద్ది సేపటికే రోస్టన్ చేజ్ కూడా బ్రాడ్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరగడంతో విండీస్ 37 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

బ్లాక్‌వుడ్, బ్రూక్స్ లేకుంటే..

బ్లాక్‌వుడ్, బ్రూక్స్ లేకుంటే..

ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బ్లాక్‌వుడ్(55), బ్రూక్స్(62) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. తొందరపడకుండా నిదానంగా ఆడుతూ.. వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. సింగిల్స్, డాట్స్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ క్రమంలోనే తొలుత బ్లాక్ వుడ్ 81 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. అనంతరం బ్రూక్స్ 95 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్థం శతకం సాధించాడు.

దెబ్బకొట్టిన స్టోక్స్..

దెబ్బకొట్టిన స్టోక్స్..

100 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన బ్లాక్ వుడ్-బ్రూక్స్ జోడీని విడదీసి స్టోక్స్ దెబ్బకొట్టాడు. బ్లాక్ వుడ్(55)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన డౌరిచ్‌ను వోక్స్ డకౌట్ కావడంతో విండీస్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హోల్డర్‌తో బ్రూక్స్ కొంత ప్రతిఘటించినా.. అది ఎక్కువసేపు కొనసాగలేదు. బ్రూక్స్‌ను సామ్ కరణ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో విండీస్ కష్టాలు రెట్టింపయ్యాయి.

హీరో బెన్ స్టోక్స్..

హీరో బెన్ స్టోక్స్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. స్టోక్స్ 176 పరుగులతో రాణించగా.. డామ్ సిబ్లీ(120) శతకం బాదాడు. అనంతరం వెస్టిండీస్ 287 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్ వైట్(75), బ్రూక్స్ (68), చేజ్(51) ఆదుకున్నారు. అనూహ్యంగా స్టువర్ట్ బ్రాడ్(3/66) చెలరేగి విండీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. స్టోక్స్(78 నాటౌట్) ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్‌తో 129/3 పరుగుల వద్ద డిక్లెర్ చేసిన ఆతిథ్య జట్టు ప్రత్యర్థి ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Story first published: Monday, July 20, 2020, 22:12 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X