న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvWI: స్టోక్స్‌ సూపర్ షో.. ఇంగ్లండ్ 469/9 డిక్లేర్డ్‌.. వెస్టిండీస్‌ 32/1

England vs West Indies, 2nd Test: Ben Stokes, Dominic Sibley star as hosts dominate day 2

మాంచెస్టర్‌: మొదటి టెస్ట్ షాక్ తర్వాత.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. సౌథాంప్టన్‌ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా విఫలమయిన బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. 176 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. మరోవైపు డోమినిక్ సిబ్లీ క్రీజులో పాతుకుపోయి మంచి సహకారం అందించాడు. రెండో రోజు మిగిలిన గంట ఆటలో విండీస్‌ ఓ వికెట్‌ కోల్పోయింది. ఇక ఇంగ్లిష్‌ బౌలర్లు మూడో చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పేలా లేవు.

 నాలుగో వికెట్‌కు 260 పరుగులు:

నాలుగో వికెట్‌కు 260 పరుగులు:

రెండో టెస్టుపై పట్టు బిగించేందుకు ఇంగ్లండ్‌ సిద్ధమైంది. బెన్‌ స్టోక్స్‌ (176; 356 బంతుల్లో 174, 26), డామ్‌ సిబ్లీ (120; 372 బంతుల్లో 54) శతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. రెండో రోజు, శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 260 పరుగులు జోడించి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపింది. ఈ జోడీ వెనుదిరిగాక ఇంగ్లండ్ తడబడింది. అయితే జోస్ బట్లర్ (40), డోమ్ బెస్ (31) పరుగులు చేయడంతో మళ్లీ నిలబడింది. రోస్టన్‌ చేజ్‌ (5/172), కీమర్‌ రోచ్‌ (2/58) దెబ్బ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌.. ఆట ఆఖరుకు 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది.

తొలి సెషన్ 57 పరుగులే:

తొలి సెషన్ 57 పరుగులే:

తొలి రోజే క్రీజ్‌లో పాతుకుపోయిన సిబ్లీ, స్టోక్స్‌ శుక్రవారం కూడా తమ జోరు కొనసాగించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 207/3తో ఆట మొదలు పెట్టిన వీరిద్దరు అంతే పట్టుదలతో నిలబడి పరుగులు రాబట్టారు. ఇద్దరు ఉదయం ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా సిబ్లీ తొలి రోజు తరహాలోనే జిడ్డుగా ఆడాడు. స్టోక్స్‌ సైతం తొలి సెషన్లో నెమ్మదిగానే ఆడాడు. 93 ఓవర్లు ముగిసిన తర్వాత విండీస్‌ కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో గడిపిన సిబ్లీ ఎట్టకేలకు 312 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే పరుగులివ్వలేదన్న సంతృప్తి విండీస్‌కు దక్కినా.. తొలి సెషన్లో వికెట్‌ పడకపోవడంతో ఇంగ్లండ్ ‌ పైచేయి సాధించింది.

 స్టోక్స్‌ ధనాధన్‌:

స్టోక్స్‌ ధనాధన్‌:

లంచ్‌ ముగిసిన వెంటనే ఛేజ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ బౌండరీతో 255 బంతుల్లో స్టోక్స్‌ శతకం మార్క్‌ను చేరుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది 10వ సెంచరీ. ఎట్టకేలకు ఈ భారీ భాగస్వామ్యాన్ని ఛేజ్‌ విడదీశాడు. డీప్‌ మిడ్‌వికెట్‌లో రోచ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో సిబ్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. సెంచరీ తర్వాత స్టోక్స్‌ మరింత ధాటిగా ఆడాడు. 46 బంతుల్లోనే అతను 100నుంచి 150 పరుగులకు చేరుకున్నాడు. టీ విరామానికి ముందే ఒలీ పోప్‌ (7) వికెట్‌ పడింది. మూడో సెషన్‌లో డబుల్‌ సెంచరీ సాధించే అవకాశం కనిపించిన స్టోక్స్‌ చివరకు దానిని అందుకోలేకపోయాడు. వరుస బంతుల్లో స్టోక్స్, వోక్స్‌ (0)లను రోచ్‌ అవుట్‌ చేయడంతో విండీస్‌కు ఊరట దక్కింది.

వెస్టిండీస్‌ 32/1:

వెస్టిండీస్‌ 32/1:

చివర్లో బట్లర్‌ (79 బంతుల్లో 40; 4 ఫోర్లు), బెస్‌ (26 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించగలిగింది. చివర్లో కొత్త బంతితో ప్రత్యర్థిని దెబ్బ తీద్దామని కెప్టెన్ జో రూట్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. అనంతరం వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్‌ (12) అవుట్‌ కాగా... బ్రాత్‌వైట్‌ (6 బ్యాటింగ్‌), అల్జారి జోసెఫ్‌ (14 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంత బాగా ఆడతారనేదానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

ఈ రోజు ఇంట్లో ఊడవడం, తూడవడం లేనట్టుంది.. రోహిత్‌కు పంచ్ ఇచ్చిన చహల్!!

Story first published: Saturday, July 18, 2020, 8:16 [IST]
Other articles published on Jul 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X