Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ రోజు ఇంట్లో ఊడవడం, తూడవడం లేనట్టుంది.. రోహిత్‌కు పంచ్ ఇచ్చిన చహల్!!

Yuzvendra Chahal hilariously trolls Rohit Sharma over his ‘Real Madrid’ tweet

బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో నాలుగు నెలలుగా టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ ‌ఆంక్షలు సడలించడంతో కొందరు ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ మొదలెట్టారు. మరొకొందరు భారత క్రికెటర్లు ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. సోషల్ మీడియా వేదికగా చహల్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలతో హల్‌చల్ చేసిన ఈ లెగ్ స్పిన్నర్.. తాజాగా మరో ఫన్నీ కామెంట్‌‌తో ఓపెనర్ రోహిత్ శర్మను ఆటపట్టించాడు.

రియల్‌ మాడ్రిడ్‌ గెలుపు:

రియల్‌ మాడ్రిడ్‌ గెలుపు:

స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ 'లా లిగా'లో రియల్‌ మ్యాడ్రిడ్‌ మరోసారి విజేతగా నిలిచింది. గురువారం విల్లారియల్‌ జట్టుతో తలపడి టైటిల్‌ పోరులో రియల్‌ మ్యాడ్రిడ్ 2-1 తేడాతో‌ గెలుపొందింది. దీంతో లా లిగా లీగ్‌లో ఆ జట్టు 34వ సారి అత్యధిక టైటిల్స్‌ సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీంతో రియల్‌ మ్యాడ్రిడ్‌ జట్టు ఫ్యాన్ అయిన టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్ వేదికగా శుక్రవారం సంతోషం వ్యక్తం చేశాడు. తన అభిమాన జట్టుకు అభినందనలు చెప్పాడు.

ఇంటి పనులు లేనట్టున్నాయి:

'రియల్‌ మ్యాడ్రిడ్‌ ఖాతాలో ఇంకో విజయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ జట్టు కలిసికట్టుగా ఆడి విజయం సాధించింది. అందరికీ అభినందనలు. మొత్తానికి ఈ ఏడాదిలో ఓ శుభవార్త విన్నాం' అని హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు తాను ఆనందంగా నవ్వుతూ చేయి పైకెత్తిన ఫొటోను రోహిత్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన యుజ్వేంద్ర చహల్.. రోహిత్ శర్మకు అదిరే పంచ్ ఇచ్చాడు. 'ఈ చిరునవ్వు వెనుక నిజమైన కారణం వేరే ఉంది. ఈ రోజు ఇంట్లో ఊడవడం, తూడవడం లాంటి పనులు లేనట్టున్నాయి' అని చహల్ కామెంట్ చేశాడు. రోహిత్ ఫొటోను టార్గెట్ చేసి చహల్ సరదాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రియల్ మాడ్రిడ్‌ జెర్సీ:

రియల్ మాడ్రిడ్‌ జెర్సీ:

ఈ ఏడాది ఆరంభంలో రోహిత్ ‌శర్మ తన సతీమణి రితికతో కలిసి స్పానిష్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియల్‌ మ్యాడ్రిడ్‌ సొంత మైదానాన్ని పరిశీలించాడు. అప్పుడు దిగిన ఫొటోలను కూడా హిట్‌మ్యాన్‌‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అయితే మ్యాచ్ చూడడానికి వెళ్లిన రోహిత్‌కు రియల్‌ మాడ్రిడ్‌ జట్టు తమ జెర్సీని అందించి ప్రత్యేకంగా గౌరవించింది. 'రో' అనే పేరుతో 45 నంబర్‌ ఉన్న జెర్సీని రియల్‌ మాడ్రిడ్‌ జట్టు రోహిత్‌కు అందించింది. భారత జెర్సీపై కూడా రోహిత్‌ది 45వ నంబరే అన్న విషయం తెలిసిందే.

ప్రాక్టీస్‌ మొదలెట్టిన రోహిత్‌:

ప్రాక్టీస్‌ మొదలెట్టిన రోహిత్‌:

ఈ ఏడాది ఆరంభంలో రోహిత్‌ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. తర్వాత తిరిగి కోలుకోవడంతో ఐపీఎల్‌లో చెలరేగుతాడని అంతా ఆశించారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఆ మెగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రోహిత్‌ ఇటీవలే లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చి స్థానిక మైదానంలో ప్రాక్టీస్‌ మొదలెట్టాడు.

Story first published: Friday, July 17, 2020, 20:47 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+