న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుప్పకూలిన ఇంగ్లండ్.. వెస్టిండీస్ లక్ష్యం 200

England vs West Indies, 1st Test: Shannon Gabriel 5-wicket haul sets up 200-run target for West Indies

సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ విజయం ముంగిట నిలిచింది. 284/8 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 7.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా వెస్టిండీస్‌ ముందు 200 స్వల్ప లక్ష్యం నమోదైంది. ఇక ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్(23), మార్క్ ఉడ్(2)లను విండీస్ బౌలర్ షెనన్ గాబ్రియెల్ ఒకే తరహాలో కీపర్‌గా క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

దీంతో అతను తన కెరీర్‌లో ఆరోసారి 5 వికెట్ల హాల్‌ను అందుకున్నాడు. ఇక నేడు మ్యాచ్‌కు చివరి రోజు కాగా.. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగితే తప్పా ఓటమి నుంచి గట్టెక్క లేదు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 204 రన్స్‌కే ఆలౌటవ్వగా.. విండీస్ 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ క్రాగ్ బ్రాత్‌వైట్‌ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ కాంప్‌బెల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే బ్రూక్స్‌ను ఆర్చర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. దీంతో వెస్టిండీస్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది.

<strong>కష్టం గంగూలీది.. ప్రతిఫలం ధోనీది: గంభీర్</strong>కష్టం గంగూలీది.. ప్రతిఫలం ధోనీది: గంభీర్

Story first published: Sunday, July 12, 2020, 16:57 [IST]
Other articles published on Jul 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X