న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ టెస్టుకు వర్షం అంతరాయం.. 17.4 ఓవర్లు మాత్రమే సాగిన ఆట.. స్కోర్ 35/1

England vs West Indies 1st Test, Day 1 Highlights: At Stumps, ENG- 35/1

సౌతాంప్టన్‌: కోట్లాది మంది అభిమానుల క్రీడ క్రికెట్‌ బుధవారం మళ్లీ మొదలైంది. కరోనా వైరస్‌ కారణంగా ఇన్ని రోజులు నిలిచిపోయిన ఆట సరికొత్తగా ఆరంభం అయింది. అయితే మ్యాచ్ చూద్దామని భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం వినోదం దక్కలేదు. ఇక నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగిన క్రికెటర్ల ఉత్సాహాన్ని వరుణుడు నీరుగార్చాడు. మొత్తానికి ఇంగ్లండ్-వెస్టిండీస్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది.

 రెండు గంటల తర్వాత టాస్‌:

రెండు గంటల తర్వాత టాస్‌:

ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్టు ముందు తొలుత చిరుజల్లులు కురవడంతో టాస్‌ ఆలస్యమైంది. వర్షం తెరిపినివ్వడంతో రెండు గంటల తర్వాత టాస్‌ వేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే ఆ జట్టు పరుగుల ఖాతా తెరవకముందే డొమినిక్‌ సిబ్లీ (0; 4 బంతుల్లో) వికెట్‌ చేజార్చుకుంది. సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్‌ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్‌ షెనాన్‌ గాబ్రియెల్‌ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మూడు ఓవర్లకు ఇంగ్లాండ్‌ 1/1తో ఉండగా.. మళ్లీ వర్షం కురిసింది. దాంతో కవర్లు కప్పారు.

మధ్య మధ్యలో వర్షం అంతరాయం:

మధ్య మధ్యలో వర్షం అంతరాయం:

కాస్త విరామం ఇచ్చిన తర్వాత మళ్లీ ఏడు బంతులు పడ్డాయో లేదో జల్లులు మొదలయ్యాయి. మొదట పిచ్‌ వరకే కవర్‌ కప్పినా.. తీవ్రత పెరగడంతో మైదానం మొత్తం కవర్లు పరిచారు. ఇక ఆట ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో విండీస్‌ సారథి జేసన్‌ హోల్డర్‌ నిరాశగా కనిపించాడు. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. మధ్య మధ్యలో వర్షం అంతరాయం కల్గించగా.. విండీస్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో డెన్లీ వరుస బౌండరీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగా.. బర్న్స్‌ వికెట్‌ కాపాడుకునేందుకు మొగ్గుచూపాడు.

రెండో రోజు కూడా వర్ష సూచన:

రెండో రోజు కూడా వర్ష సూచన:

టీ విరామానికి ముందుగానే వెళ్లినా.. వెలుతురు మందగించడానికి తోడు మైదానం చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ (55 బంతుల్లో 20 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది.

సోషల్ డిస్టెన్స్:

సోషల్ డిస్టెన్స్:

టాస్‌ కోసం ఇరు జట్ల కెప్టెన్లు హోల్డర్‌, స్టోక్స్‌ వచ్చారు. టాస్‌ గెలిచిన స్టోక్స్‌కు హోల్డర్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి పోగా.. ఫిస్ట్‌ బంప్స్‌తో స్టోక్స్‌ నవ్వుతూ రిప్లే ఇచ్చాడు. ఇంగ్లండ్‌ తుది జట్టులో సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్‌ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి సంతాప సూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. అయితే మైదానంలో ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలు పాటించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు.

కుమార్తెకు అద్భుతమైన పేరు పెట్టిన ఉసేన్ బోల్ట్‌!!

Story first published: Thursday, July 9, 2020, 7:47 [IST]
Other articles published on Jul 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X