Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుమార్తెకు అద్భుతమైన పేరు పెట్టిన ఉసేన్ బోల్ట్‌!!

Usain Bolt reveals baby daughters name

జ‌మైకా: ఆల్ టైమ్ గ్రేట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ గత మే నెలలో తండ్రయిన విషయం తెలిసిందే. అతని సహచరి కేసీ బెన్నెట్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా త‌న కూతురి ఫోటోల‌ను బోల్ట్ రిలీజ్ చేశాడు. అంతేకాదు బోల్ట్‌.. త‌న కూతురికి ఓ అద్భుతమైన పేరును కూడా పెట్టాడు. 'ఒలంపియా లైట‌నింగ్ బోల్ట్' అని తన కుమార్తెకు పేరు పెట్టాడు. గ‌ర్ల్‌ఫ్రెండ్ కాసీ బెన్నెట్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న కూతురు ఒలింపియా ఫోటోల‌ను బోల్ట్ షేర్ చేశాడు.

వంద మీట‌ర్ల ప‌రుగులో మెరుపు వీరుడిగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్‌తో చాన్నాళ్ల నుంచి స్నేహం చేస్తున్న కాసీ బెన్నెట్‌.. చిన్నారి ఒలంపియాకు జ‌న్మ‌నిచ్చారు.. మే 17వ తేదీన త‌మ‌కు బిడ్డ పుట్టిన‌ట్లు బోల్ట్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. బోల్ట్ త‌న కూతురి ఫోటోల‌ను షేర్ చేయ‌గానే.. టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ హార్ట్ ఎమోజీల‌తో రిప్లై ఇచ్చింది. ఎందుకంటే సెరీనా కూతురు పేరులో కూడా ఒలంపియా అని ఉంటుంది. సెరీనా కూతురి పూర్తి పేరు 'అలెక్సిస్ ఒలంపియా'.

ఐక తనన సంతానాన్ని తన అడుగు జాడల్లో నడవనియ్యనని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఉసెన్ బోల్ట్ తెలిపాడు. 'నా పిల్లలు నాలానే కావాలనుకుంటే మంచిదే. కానీ మొదట్లో మాత్రం వద్దని చెబుతాను. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మొదటగా మాత్రం అడుగు జాడల్లో నడవనియ్యను. ఆ తరువాత వారి ఇష్టం' అని బోల్ట్ చెప్పుకొచ్చాడు.

దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్‌ 2017లో రిటైర్‌ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్‌.. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. 100,200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన వరల్డ్ రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఓవరాల్‌గా తన అథ్లెటిక్ కెరీర్‌లో 8 ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలను బోల్ట్ సాధించాడు.

2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌ అనంతరం బోల్ట్ అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. బోల్ట్‌ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే తన కెరీర్‌ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Wednesday, July 8, 2020, 17:44 [IST]
Other articles published on Jul 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+