న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చారిత్రాత్మక టెస్ట్‌లో బ్రాత్ వైట్ హాఫ్ సెంచరీ.. రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

 England vs West Indies, 1st: Brathwaite hits fifty after Bess gets Hope

సౌతాంప్టన్: పోస్ట్ కరోనా తర్వాత మొదలైన ఆటలో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. తొలి రోజు వర్షంతో తుడిచి పెట్టుకు పోగా.. రెండో రోజు బౌలర్ల ఆదిపత్యం నడిచింది. కానీ మూడో రోజు మాత్రం బ్యాటింగ్ జోరు నడుస్తోంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న చారిత్రాత్మక తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ ఓపెనర్ బ్రాత్ వైట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కరోనా తర్వాత ప్రారంభమైన ఆటలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

57/1 ఓవర్ నైట్ స్కోర్‌తో శుక్రవారం మూడో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ నిలకడగా ఆడుతుంది. ఆచితూచి ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన బ్రాత్ వైట్, షై హోప్ జోడీని ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ విడదీసాడు. హైహోప్(16)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన షమరత్ బ్రూక్స్(9)తో బ్రాత్ వైట్ (51) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక 38 ఓవర్లు ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 90 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇక మూడు నెలల తర్వాత మొదలైందన్న ఆనందాన్ని తొలి రోజు 17 ఓవర్లకే పరిమితం చేసిన వరణుడు.. రెండో రోజు మాత్రం కరుణించాడు. లంచ్ బ్రేక్‌లో పలుకరించినా.. కరిబీయన్ల ఖతర్నాక్ బౌలింగ్ చూసి వెళ్లిపోయాడు. పిచ్‌పై తేమ, చల్లటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్ బౌలర్లు రెచ్చిపోయారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌కు చుక్కులు చూపించారు. బుల్లెట్ల లాంటి బంతులతో షెనన్ గాబ్రియెల్(4/62) టాపార్డర్ పని పట్టేసి మంచి ఆరంభం ఇస్తే.. కెప్టెన్ జేసన్ హోల్డర్( 6/42) సిక్సర్‌తో ప్రత్యర్థిపై దండయాత్ర చేశాడు. దీంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది.

ఇక టాపార్డర్ తేలిపోయిన చోట తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్(43), కీపర్ జోస్ బట్లర్(35), స్పిన్నర్ డామ్ బెస్(31 నాటౌట్) విలువైన 0పరుగులు చేశారు. ఓపెనర్ రోరి బర్న్స్(30) ఫర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ బ్యాడ్ లైట్ కారణంగా ఆట ముగిసే సమయానికి 19.3 ఓవర్లలో 57/1 స్కోర్ చేసింది.

Story first published: Friday, July 10, 2020, 17:08 [IST]
Other articles published on Jul 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X