న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాంటన్ రివర్స్‌స్వీప్‌ సిక్స్.. చూస్తే వావ్ అంటారు (వీడియో)

England vs Pakistan: Tom Banton reverse sweeps Imad Wasim for a stunning six in 2nd T20I

మాంచెస్టర్‌: రివర్స్‌స్వీప్ షాట్‌ను చాలామంది బ్యాట్స్‌మన్‌ ఆడుతారు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఆధిపత్యం కొనసాగించేందుకు బ్యాట్స్‌మెన్‌లు ప్రయోగించే ప్రధాన అస్త్రం రివర్స్‌స్వీప్. ఈ షాట్‌ను ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తరచుగా ఆడుతుంటాడు. రివర్స్‌స్వీప్‌లోనే భారీ భారీ సిక్సర్లు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా వార్నర్ తరహాలోనే ఇంగ్లండ్ ఓపెనర్ టామ్ బాంటన్ ఆడి ఔరా అనిపించాడు.

బాంటన్ రివర్స్‌స్వీప్

బాంటన్ రివర్స్‌స్వీప్

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ ముగించుకుని టీ20లు ఆడుతోంది. మాంచెస్టర్‌లో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టామ్ బాంటన్ రివర్స్‌స్వీప్ షాట్‌ ఆడాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసేందుకు పాక్ స్పిన్నర్ ఇమాద్ వసీమ్ బంతినందుకున్నాడు. తొలి బంతినే బాంటన్ సిక్స్‌గా బాదాడు. ఇమాద్ లెంగ్త్‌ని ముందే పసిగట్టిన బాంటన్.. రివర్స్ స్వీప్ ఆడాడు. బంతి సరిగ్గా కనెక్ట్ అవడంతో నేరుగా వెళ్లి స్టాండ్స్‌‌లో పడింది. సాధారణంగా రివర్స్ స్వీప్‌‌‌లో సిక్స్ కొట్టడం కష్టం.ఇక డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో అయితే మరి కష్టం. కానీ బాంటన్ మాత్రం అలవోకగా బాదేశాడు.

కామెంటేటర్ల ప్రశంసలు:

కామెంటేటర్ల ప్రశంసలు:

టామ్ బాంటన్ రివర్స్ స్వీప్‌లో సిక్స్ కొట్టడం మ్యాచ్ కామెంటేటర్లని సైతం ఆశ్చర్యపరిచింది. వావ్.. బాంటన్ సూపర్ అంటూ పొగిడేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు లీకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఇమాద్.. తొలి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. దీంతోనే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అతనికి మూడో ఓవర్ ఇచ్చాడు. కానీ బాంటన్, జానీ బెయిర్‌స్టోలు చెలరేగడంతో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 16 ఓవర్ వరకూ ఇమాద్ చేతికి బాబర్ బంతినివ్వలేదు. మూడు ఓవర్లు వేసిన ఇమాద్.. వికెట్ తీయకుండా 30 రన్స్ ఇచ్చాడు.

 నైట్‌రైడర్స్ తరఫున

నైట్‌రైడర్స్ తరఫున

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 21 ఏళ్ల టామ్ బాంటన్ ఆడనున్నాడు. గత డిసెంబర్ మాసంలో జరిగిన వేలంలో రూ. 1 కోటికి అతడ్ని కోల్‌కతా కొనుగోలు చేసింది. బాంటన్ ఇంగ్లండ్ తరపున 6 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో ఒక్కో హాఫ్ సెంచరీ బాదాడు.

ఇంగ్లండ్‌ విజయం:

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్ ‌(56), మొహమ్మద్ హఫీజ్ (69) హాఫ్‌ సెంచరీలు చేశారు. 196 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇయాన్‌ మోర్గాన్ ‌(66; 33 బంతుల్లో 6x4, 4x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్‌ మలన్‌ (54 నాటౌట్‌; 36 బంతుల్లో 6x4, 1x6) అర్ధ సెంచరీతో రాణించాడు. బాంటన్ (20: 16 బంతుల్లో 1x6) పర్వాలేదనిపించాడు.

తొలి బంతికి కాస్త భయపడ్డా: కోహ్లీ

Story first published: Monday, August 31, 2020, 14:25 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X