న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: అదృష్టమంటే పాక్‌దే.. ఓటమి నుంచి గట్టెక్కించిన వరణుడు.. ఇంగ్లండ్‌దే సిరీస్!

England vs Pakistan: James Anderson gets to 600 as Joe Root Team win series 1-0

సౌతాంప్టన్‌: వారెవ్వా అదృష్టమంటే పాకిస్థాన్‌దే. చిత్తుగా ఓడడం ఖాయమనుకున్న స్థితి నుంచి వరుణుడి అండతో ఊపిరి పీల్చుకుంది. ఆదివారం చివరిరోజు పూర్తి ఆట సాధ్యం కాకపోవడంతో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే మూడు టెస్టుల సిరీస్‌ను రూట్‌ సేన 1-0తో దక్కించుకుంది. చివరిరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్ 27.1 ఓవర్లు ఆడి మరో 87 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.

తొలి రెండు సెషన్లు రద్దు..

తొలి రెండు సెషన్లు రద్దు..

వర్షం కారణంగా తొలి రెండు సెషన్ల ఆట వీలు కాలేదు. సాయంత్రం పరిస్థితి అనుకూలించగా 27.1 ఓవర్ల ఆట కొనసాగింది. ఆ సమయానికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 83.1 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ స్కోరు వద్ద ఉన్నపుడు మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు ‘డ్రా'కు అంగీకరించి ఆటను ముగించారు.

బాబర్‌ ఆజమ్‌ (63 నాటౌట్‌), అబిద్‌ అలీ (42) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 583/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

అండర్సన్ వరల్డ్ రికార్డు..

అండర్సన్ వరల్డ్ రికార్డు..

అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వర్షం అంతరాయం... అనంతరం అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో చివరిరోజు రెండు సెషన్‌లలో ఆట సాధ్యపడలేదు. దాంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరుతుందా లేదా అని ఉత్కంఠ పెరిగింది. అయితే టీ విరామం తర్వాత ఆట ఆరంభం కావడంతో అండర్సన్‌ వికెట్ల వేటపై గురి పెట్టాడు. తాను వేసిన 14వ బంతికి అండర్సన్‌కు వికెట్‌ దక్కింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ (31; 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్లిప్‌లో అందుకోవడంతో అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్‌ చేరింది.

డబుల్ హీరోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌..

డబుల్ హీరోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌..

కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ కమ్ డబుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న జాస్‌ బట్లర్, రిజ్వాన్‌ సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు గెల్చుకున్నారు. రెండు జట్ల మధ్య ఈనెల 28న మాంచెస్టర్‌లో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ మొదలవుతుంది.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 583/8 డిక్లేర్డ్‌ (154.4 ఓవర్లలో) (జాక్‌ క్రాలీ 267; బట్లర్‌ 162; ఫవాద్‌ ఆలమ్‌ 2/46); పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 273 ఆలౌట్‌ (అజహర్‌ అలీ 141 నాటౌట్‌; అండర్సన్‌ 5/56); పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 187/4 (83.1 ఓవర్లలో) (బాబర్‌ ఆజమ్‌ 63 నాటౌట్‌; అజహర్‌ అలీ 42; అండర్సన్‌ 2/45).

సచిన్ 100 సెంచరీల రికార్డు‌ను బ్రేక్ చేసే సత్తా అతనికే ఉంది: ఇర్ఫాన్ పఠాన్

1
46764
Story first published: Wednesday, August 26, 2020, 8:02 [IST]
Other articles published on Aug 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X