న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 100 సెంచరీల రికార్డు‌ను బ్రేక్ చేసే సత్తా అతనికే ఉంది: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Believes Virat Kohli can break Sachin Tendulkars Record Of 100 Centuries

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును అధిగమించే సత్తా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే ఉందని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. బయటకు చెప్పకున్నా కోహ్లీ మనసులో కూడా ఈ రికార్డును అందుకోవాలనే కోరిక ఉందని తెలిపాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న పఠాన్.. ఒకవేళ సచిన్ 100 సెంచరీల రికార్డును ఎవరైనా అధిగమిస్తే వారు భారత ప్లేయర్ కావాలని ఆకాంక్షించాడు.

'100 సెంచరీల రికార్డు అధిగమించే సామర్థ్యం విరాట్‌కే ఉంది. అతని ఫిట్‌నెస్ లెవెల్స్ అలాంటివి. ఇప్పటికే అతను 70 సెంచరీలు పూర్తి చేసుకొని ఇంకో 30 శతకాల దూరంలో ఉన్నాడనుకుంటా. అతను రిటైర్ అయ్యేలోపు ఈ ఘనతను అందుకుంటాడు. ఆ లక్ష్యం అతను కూడా పెట్టుకున్నాడు. 100 సెంచరీల గురించి విరాట్ కోహ్లీ ఆలోచిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయం బయటకు చెప్పకపోయినా.. మనసులో మాత్రం అనుకుంటున్నాడు.

సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరైనా ఆ ఘనతను అందుకుంటారా? అంటే అది ఖచ్చితంగా కోహ్లీనే. చాలా తక్కువ సమయంలోనే అతను చాలా సాధించాడు. అందుకే ఈ 100 సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడని భావిస్తున్నా. ఈ అరుదైన ఫీట్ ఎవరు అందుకున్నా.. అతను భారత ఆటగాడే కావాలనేది నా కోరిక. ఎందుకంటే సచిన్ పాజీ 100 సెంచరీల ప్రయాణంలో నేను కూడా ఉన్నా.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

ఇక విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 43, టెస్ట్‌ల్లో 27 సెంచరీలతో ఇప్పటికే 70 శతకాలు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ కన్నా రికీ పాంటింగ్ (71), సచిన్ (100) ముందున్నారు. వన్డేల్లో సచిన్ కన్నా కోహ్లీ 7 సెంచరీలు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. నిలకడకే మారుపేరైన కోహ్లీ.. ఇప్పటికే వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకోని అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నాడు. సచిన్ 259 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకుంటే కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10వేల మార్క్‌ను దాటాడు. 86 టెస్ట్‌ల్లో 7240 రన్స్ చేశాడు. 82 టీ20ల్లో 2794 రన్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

బిత్తిరి అంపైర్.. వైడ్ సిగ్నల్ ఇచ్చి అంతలోనే ఔట్ ఇచ్చాడు! (వీడియో)బిత్తిరి అంపైర్.. వైడ్ సిగ్నల్ ఇచ్చి అంతలోనే ఔట్ ఇచ్చాడు! (వీడియో)

Story first published: Monday, August 24, 2020, 17:44 [IST]
Other articles published on Aug 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X