న్యూయార్క్: అమెరికా మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ పియర్ల్ గొంజాలెజ్ తన హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది. మోస్ట్ హాటెస్ట్ ఫీమెల్ ఫైటర్‌గా గుర్తింపు పొందిన ఆమె.. ప్రస్తుతం ఇన్విక్టా ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. చిన్న వయసులోనే బాక్సర్‌గా కెరీర్ మొదలు పెట్టిన పియర్ల్.. 2008 గోల్డెన్ గ్లోవ్స్ అమెచ్యూర్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అనంతరం 2012 నుంచి ఫ్రొఫెషనల్ ఫైటర్‌గా మారింది.
ఇక 2017లో ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లోకి అరంగేట్రం చేసిన 34 ఏళ్ల పియర్ల్.. అంతకుముందే ఎక్స్ట్రీమ్ ఫైటింగ్ చాంపియన్‌షిప్, ఎక్స్ట్రీమ్ ఫైటింగ్ ఆర్గనైజేషన్ పోటీల్లో పాల్గొంది. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యూటీ ఫైటర్ అద్భుత రికార్డు కలిగి ఉంది.
10 మ్యాచ్‌ల్లో గెలిచి కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిపాలైంది. ఇక ఈ చికాగో బ్యూటీ రింగ్ ట్రాక్ రికార్డు పక్కన పెడితో సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో నెటిజన్ల మదిని దోచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 179వేల ఫాలోయర్లు ఉన్నారంటే ఆమె పాపులారిటీ గురించి చెప్పనక్కర్లేదు. పియర్ల్ హాట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
(ఫొటోలు: పియర్ల్ గొంజాలెజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి)