న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: అలవాటులో పొరపాటు.. కరోనా రూల్స్ మర్చిపోయిన కెప్టెన్లు!!

England vs Pakistan: Azhar Ali, Joe Root forget Coronavirus rules, shake hands after toss

మాంచెస్టర్‌: లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ మొదలైంది. కరోనా వైరస్ వ్యాప్తినిఅడ్డుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బంతిపై ఉమ్మి రుద్దకూడదు, మైదానంలో ఆటగాళ్లు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు. భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందే. అలానే వికెట్ పడిన సమయంలో హైఫై‌ని కూడా నిషేధించింది. ఆటగాళ్లకి పాత అలవాట్లని దూరం చేసేందుకు ప్రాక్టీస్ సెషన్, వార్మప్ మ్యాచ్‌లను కూడా నిర్వహించారు. అయినా కూడా ఆటగాళ్లు అలవాటులో పొరపాటుగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు.

టాస్ టైమ్‌లోనే:

టాస్ టైమ్‌లోనే:

ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. టాస్ టైమ్‌లోనే రెండు జట్ల కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. అజహర్ అలీ టాస్ గెలవగా.. జో రూట్ షేక్‌హ్యాండ్ ఇచ్చి అభినందించాడు. రూట్ షేక్‌హ్యాండ్‌కి చేయి చాచడంతో.. అలీ కూడా చేయి కలిపేశాడు. అయితే ఆలీకి ఐసీసీ రూల్‌ గుర్తొచ్చి.. తప్పు జరిగిపోయిందనేలా ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అలా అలీ, రూట్‌లు కరోనా నిబంధనలను అతిక్రమించినట్లయింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జేసన్‌ హోల్డర్‌ కూడా:

జేసన్‌ హోల్డర్‌ కూడా:

గత నెల కూడా విండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభించినప్పుడు ఆ జట్టు సారథి జేసన్‌ హోల్డర్‌, ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌ బెన్ ‌స్టోక్స్‌ ఇలాగే షేక్‌హ్యాండ్ ఇచ్చుకోబోయారు. అనుకోకుండా చేతులు కలపడానికి ప్రయత్నించి వెంటనే తేరుకొని వెనక్కి తీసుకున్నారు. దీంతో వారు షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోకుండా వెనుతిరిగారు. ఇప్పుడు మాత్రం.. అజర్ అలీ‌, జో రూట్‌ ఆ విషయాన్ని మర్చిపోయి వ్యవహరించారు. మ్యాచ్‌లో టాస్ వేసిన తర్వాత.. టాస్ గెలిచిన కెప్టెన్‌కి ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించడం క్రికెట్‌లో ఓ సంప్రదాయం.

49 ఓవర్ల ఆట మాత్రమే:

49 ఓవర్ల ఆట మాత్రమే:

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పాకిస్థాన్‌ జట్టు ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో ఫర్వాలేదనిపించింది. అయితే బయో సెక్యూర్ వాతావరణంలో మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. కేవలం 49 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. బుధవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ మ్యాచ్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ (69 బ్యాటింగ్‌; 100 బంతుల్లో 11×4), ఓపెనర్ షాన్‌ మసూద్‌ (46 బ్యాటింగ్‌; 152 బంతుల్లో 7×4) క్రీజులో ఉన్నారు.

బయోసెక్యూర్‌ విధానంలో:

బయోసెక్యూర్‌ విధానంలో:

ఐసీసీ కొత్త నిబంధనలతో ఇటీవలే బయోసెక్యూర్‌ విధానంలో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఘనంగా నిర్వహించిన ఇంగ్లండ్.. తాజాగా ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు పాకిస్థాన్‌తో మరో మూడు టెస్టుల సిరీస్‌ నిర్వహింస్తోంది. బయోసెక్యూర్‌ విధానంలో ఆటగాళ్లు సురక్షితం అని అన్ని బోర్డులు ఇదే విధానాన్ని పాటించనున్నాయి.

యూఏఈ ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం సవాలే.. అక్కడ ఆడటం అంత సులువు కాదు: రోహిత్

Story first published: Thursday, August 6, 2020, 11:14 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X