
ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం సవాలే:
బుధవారం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూఏఈలో లీగ్ ఆడనుండటంపై స్పందించాడు. 'యూఏఈలోని పిచ్‌లు కొంచెం నెమ్మదిగా ఉంటాయి. అయితే పరిస్థితులు మాత్రం చాలా వరకు భారత్‌కు దగ్గరగానే ఉంటాయి. కానీ అక్కడి అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం మాత్రం సవాలే. ఉక్కపోత అధికంగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని ఏవో ప్రణాళికలు వేసుకుంటే.. మైదానంలోకి వెళ్లేసరికి అంతా మారిపోవచ్చు' అని హిట్‌మ్యాన్ అన్నాడు. యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యమన్నాడు. జట్టులోని కొందరు ఇంతకుముందు ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచులు ఆడలేదని చెప్పాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ నాలుగు టైటిళ్లు అందించాడు.

అతి పెద్ద విరామం ఇది:
ఐపీఎల్ కోసం ఇంకొన్ని రోజుల్లోనే సన్నద్ధత మొదలుపెట్టనున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. 'ఇంకో వారంలో నేను వ్యాయామం చేసే జిమ్ ప్రారంభం అవుతుంది. శరీర దృఢత్వ కసరత్తులు చేస్తా. ఐపీఎల్ ముందు ప్రాక్టీస్ విషయంలో ఏం హడావుడి పడాల్సిన పనిలేదు. అందరికి కావాల్సినంత సమయం ఉంది. ఆట కోసం నెమ్మదిగా సన్నద్ధమవ్వొచ్చు. నా కెరీర్లో బ్యాట్ పట్టకుండా తీసుకున్న అతి పెద్ద విరామం ఇది. నా శరీరం మెరుగైన స్థితిలోనే ఉందనుకుంటున్నా. గతంలో కంటే బలవంతుడినైనట్లు అనిపిస్తోంది. మనసు కూడా విశ్రాంతి పొందింది' అని రోహిత్ పేర్కొన్నాడు.

స్వచ్ఛమైన ఆనందం అదే:
'కుటుంబం ప్రాధాన్యమేంటో నాకు గతంలో కంటే ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. మ్యాచుల కోసం నేను సంవత్సరంలో ఎక్కువగా ఇంట్లో ఉండను. వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇంట్లో ఉన్న కొద్దిసమయంలోనే ఆనందంగా ఉండాలి. కానీ నా కూతురితో గత కొన్ని నెలల సమయాన్ని ఆస్వాదించా. సమైరా ఇప్పుడే పెరుగుతోంది. ఆమె జీవితంలోని ఈ సంవత్సరాలను నేను మిస్ అవ్వకూడదనుకుంటున్నా. సమైరాతో ఎక్కువ సమయం గడపడం, ఆమెతో ఆడుకోవడం, ఆమెను నిద్రపుచ్చడం స్వచ్ఛమైన ఆనందం' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్ లాస్ట్:
తన కెప్టెన్సీ శైలిల గురించి రోహిత్ శర్మ స్పందిస్తూ... 'కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టులో అందరికంటే తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తి మనమే అని భావించాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా కనిపించడం అనుకుని చేసేది కాదు. కోపమొచ్చినా సహచరులపై చూపించకూడదు. భావోద్వేగాల్ని దాచుకోవడం ముఖ్యమైన విషయం' అన్నాడు.
IPL 2020: ఫైవ్ స్టార్ హోటళ్లు కాదు.. వసతి కోసం రిసార్ట్, అపార్ట్‌మెంట్‌లు!


Click it and Unblock the Notifications












