న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Pakistan: మసూద్ రికార్డు సెంచరీ.. చెలరేగిన అబ్బాస్‌.. కష్టాల్లో ఇంగ్లండ్‌

England vs Pakistan 1st Test: Shan Masood, Mohammad Abbas put Pakistan on top


మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (156; 319 బంతుల్లో 184, 26) అద్భుత సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన పాక్‌.. అనంతరం బంతితోనూ విజృంభించి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. పాక్‌ పేసర్ల ధాటికి తడబడ్డ ఇంగ్లండ్‌ రెండో రోజు (గురువారం) ఆట ముగిసే సమయానికి 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోరి బర్న్స్‌ (4), డొమినిక్ సిబ్లే (8), బెన్ స్టోక్స్‌ (0), జో రూట్‌ (14) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఒలీ పోప్‌ (46), జొస్ బట్లర్‌ (15) క్రీజులో ఉన్నారు. మొహమ్మద్‌ అబ్బాస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.
 ఆదుకున్న మసూద్‌:

ఆదుకున్న మసూద్‌:

ఓవర్‌నైట్‌ స్కోరు 139/2తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ తొలి ఓవర్లోనే అదే స్కోరు వద్ద బాబర్‌ ఆజమ్‌ (69) వికెట్‌ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే అసద్‌ షఫీఖ్‌, రిజ్వాన్‌ వెనుదిరిగారు. షఫిక్ (7)‌ బ్రాడ్‌కు చిక్కగా, రిజ్వాన్‌ (9)ను వోక్స్‌ వెనక్కి పంపాడు. ఈ సమయంలో బౌలర్లకు అడ్డుకట్టు వేస్తూ.. పాకిస్థాన్‌ను మసూద్‌ ఆదుకున్నాడు. లంచ్‌ సమయానికి పాక్‌ 187/5తో నిలిచింది.

రికార్డు‌ సెంచరీ:

రికార్డు‌ సెంచరీ:

ఒకవైపు వికెట్లు పోతున్నా షాన్‌ మసూద్‌ పట్టుదలగా నిలిచాడు. సిసలైన టెస్టు ఇన్నింగ్స్‌ ఆడాడు. దుర్భేద్యమైన డిఫెన్స్‌తో బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ఈ ఇన్నింగ్స్‌లో ఆడినన్ని బంతులను ఇంగ్లండ్‌లో గత 24 ఏళ్లలో ఏ పాక్‌ ఓపెనర్‌ కూడా ఆడలేదు. నిజానికి మొదటి రోజు కంటే మసూద్‌ వేగం పెంచాడు. 156 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పూర్తి చేసిన అతడు.. 251 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత 60 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇంగ్లీష్‌ పేస్‌ను తట్టుకుని నిలిచి పాక్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అంటే కారణం మసూదే.

 షాదాబ్‌ ఖాన్‌ షో:

షాదాబ్‌ ఖాన్‌ షో:

ఇక షాదాబ్‌ ఖాన్‌ (45; 76 బంతుల్లో 34) మసూద్‌కు అండగా నిలిచాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 105 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దింది. షాదాబ్‌ ఖాన్‌తో పాటు యాసిర్‌ షా (5), మోహమ్మద్ అబ్బాస్‌ (0) పది పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో మసూద్‌ దూకుడు పెంచాడు. స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. జట్టు స్కోరును మూడొందలు దాటించాడు .పాక్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన మసూద్‌ చివరికి తొమ్మిదో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్రాడ్‌ అదే ఓవర్లో నసీమ్‌ షాను కూడా ఔట్‌ చేసి పాక్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

అన్వర్‌ తర్వాత:

అన్వర్‌ తర్వాత:

సయీద్‌ అన్వర్‌ (1996) తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు శతకం సాధించిన తొలి పాక్‌ ఓపెనర్‌గా మసూద్‌ ఘనత సాధించాడు. టెస్టుల్లో మసూద్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. వరుసగా మూడోది కావడం విశేషం. నిరుడు డిసెంబరులో శ్రీలంకపై 135 చేసిన అతడు.. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌పై 100 కొట్టాడు.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

ఆపై తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోరి బర్న్స్‌ (4) తొలి ఓవర్లోనే షాహీన్‌ షా అఫ్రిదికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక నాలుగో ఓవర్లో సిబ్లే (8)ని, ఆరవ ఓవర్లో స్టోక్స్‌ (0)ను అబ్బాస్‌ ఔట్ చేశాడు. ఈ సమయంలో కెప్టెన్ రూట్ (14)తో కలిసి పోప్‌ (46) ఆదుకున్నాడు. యాసిర్‌ షా రూట్ వికెట్‌ పడగొట్టడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇక ఆట ముగిసే సమయానికి 92 పరుగులు చేసింది.

సీపీఎల్ 2020కి దూరం కానున్న ముగ్గురు స్టార్ ఆటగాళ్లు!!

Story first published: Friday, August 7, 2020, 7:57 [IST]
Other articles published on Aug 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X