న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన బెయిర్‌స్టో.. ఇంగ్లడ్‌దే వన్డే సిరీస్!

England vs Ireland 2nd ODI: Sam Billings, David Willey take hosts to 4-wicket win

సౌతాంప్టన్‌: కరోనా విరామం తర్వాత జరిగిన తొలి వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన సెకండ్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కర్టిస్‌ కాంపర్‌ (68) ఆదుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 రన్స్ చేసింది.

ఇక 91 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఐర్లాండ్‌ను.. ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ కాంపర్‌ ఆదుకున్నాడు. సిమీ సింగ్‌ (25)తో ఏడో వికెట్‌కు 60.. మెక్‌బ్రైన్‌ (24)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 56 రన్స్‌ జోడించడంతో ఐర్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ స్థితిలో వన్డేల్లో ఐర్లాండ్‌ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా కాంపర్‌ గుర్తింపు పొందాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లే, సకిబ్ మహమూద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జేమ్స్ విన్స్, టోప్లీ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ జాసన్ రాయ్(0) వికెట్ కోల్పోయింది. బెయిర్‌స్టో(41 బంతుల్లో 2 సిక్స్‌లు, 14 ఫోర్లతో 82) ధాటైన ఇన్నింగ్స్‌కు.. సామ్ బిల్లింగ్స్(61 బంతుల్లో 6 ఫోర్లు 46 నాటౌట్), డెవిడ్ విల్లే(47 నాటౌట్) తోడవడంతో 32.3 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బెయిర్‌స్టోకు మ్యాన్ఆఫ్‌ది మ్యాచ్ వరించింది.

Story first published: Sunday, August 2, 2020, 9:19 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X