న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి నిరాశపరిచిన వార్నర్: ఈసారి బ్రాడ్ కాదు ఆర్చర్

England vs Australia Ashes 2019 Live Score 5th Test Day 2: Jofra Archer gets David Warner in his 1st over

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి నిరాశపరిచాడు. గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఇంగ్లాండ్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జోస్ బట్లర్(70), కెప్టెన్ జో రూట్(57) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసి ఆలౌటైంది.

భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కోసం కెప్టెన్ పదవికి రాజీనామాభారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కోసం కెప్టెన్ పదవికి రాజీనామా

ఐదు వికెట్లు తీసిన మిచెల్ మార్ష్

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ మార్ష్ ఐదు వికెట్లు తీయగా... ప్యాట్ కమ్మిన్స్(3), జోష్ హెజెల్‌ఉడ్ (2) వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు 5 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) వికెట్‌ను కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతికి వార్నర్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

జోఫ్రా ఆర్చర్ వేసిన

జోఫ్రా ఆర్చర్ వేసిన

జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి వార్నర్ బ్యాట్ ఎడ్జిని తీసుకుని నేరుగా వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఫీల్డర్లు అఫ్పీల్‌ను ఫీల్డ్ అంఫైర్ ఎరాస్మస్ తిరస్కరించడంతో ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్లింది. అయితే, రివ్యూలో బంతి వార్నర్ బ్యాట్‌ను తాకినట్లు చిన్నపాటి స్పైక్ కనిపించడంతో థర్డ్ అంఫైర్ ఔట్‌గా ప్రకటించడంతో వార్నర్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

నాన్న చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి అరుణ్‌ జైట్లీ ధైర్యం చెప్పారు: కోహ్లీ

వార్నర్ చెత్త ప్రదర్శన

ఈ యాషెస్ సిరిస్‌లో వార్నర్ తన చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ఈ సిరిస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి ఒకే అర్ధసెంచరీ చేసిన డేవిడ్‌ ఘోరంగా విఫలమయ్యాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ ఆరుసార్లు బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే, ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో ఔటవడం విశేషం.

14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఆ తర్వాత మరో ఓపెనర్ మార్కస్ హారిస్ (3) కూడా ఆర్చర్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లకు గాను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది. క్రీజులో లబుఛాగ్నే(6), స్టీవ్ స్మిత్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Story first published: Friday, September 13, 2019, 17:05 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X